జబర్దస్త్ ఆర్టిస్ట్ లు రాకింగ్ రాకేశ్ – జోర్దార్ సుజాతలు పెళ్లి చేసుకున్నారు. ఇటీవల వీరి ఎంగేజ్ మెంట్ జరగగా…తాజాగా మూడుముళ్ల బంధంతో ఈ జంట ఒక్కటయ్యారని తెలుస్తోంది. తిరుమల తిరుపతిలో వీరి పెళ్లి చేసుకున్నట్లు సమాచారం.
రాకేశ్ దంపతుల పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో వీరి పెళ్లి జరిగిందనే విషయం వెలుగులోకి వచ్చింది. అయితే.. గోప్యంగానే ఈ ప్రేమ జంట వివాహం జరిగినట్లు సమాచారం. కేవలం బంధు, మిత్రులను మాత్రమే పెళ్లికి ఆహ్వానించారు. జబర్దస్త్ మాజీ జడ్జి రోజా వీరి పెళ్లికి హాజరై వధూవరులను ఆశీర్వదించింది. ఇక, వీరు పెళ్లి చేసుకున్నారని తెలియడంతో నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
పెళ్లికి ముందే సుజాత రాకేష్ ఇంటి సభ్యురాలిగా మారిపోయారు. సంవత్సరకాలంగా ఆమె రాకేశ్ ఇంట్లోనే ఉంటూ వస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా రాకేశ్ తల్లి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆమె మా ఇంట్లో అడుగు పెట్టాకే మా ఇంట్లో సందడి ఎక్కువ అయిందని చెప్పుకొచ్చింది. అసలు రాకేశ్ కు పెళ్లి చేసుకోవాలనే ఆలోచనే లేకున్నా అతని మనస్సు మార్చి సుజాత తమ ఇంటి కోడలు అయిందని రాకేశ్ తల్లి చెప్పుకొచ్చింది.
మొదట్లో రాకేశ్ – సుజాతల ప్రేమించుకుంటున్నారని వార్తలు వచ్చినా అందరూ కొట్టిపారేశారు. వారు చేసే స్కిట్లు హిట్ కావాలనే ఇలా చేస్తున్నారని అనుకున్నారు. కాని తరువాత తాము నిజంగానే ప్రేమలో ఉన్నామని రాకేశ్ చెప్పడంతో అంత నమ్మారు.