తాను కుక్కలను ప్రేమిస్తానని, నగరంలో ఉన్న వీధి కుక్కలను ఏరి పారేయలేను అని జిహెచ్ఎంసి మేయర్ విజయలక్ష్మీ వితండవాదం చేశారు. దానికి తోడూ ‘వీధి కుక్కలు తమ పిల్లలను పీక్కు తింటుంటే తల్లిదండ్రులు ఏం చేసున్నారు? మీ పిల్లలను మీరు కాపాడుకోకపోతే ఎవరు కాపాడతారు?’ అని ఎదురు ప్రశ్న వేశారు. అయినా ఇలాంటి పనులు కూడా జిహెచ్ఎంసి చేయాలా? అని ప్రెస్ తో కోపంగా మాట్లాడారు.
ఆమె బాధ్యతారహిత జవాబుకు ఎలా స్పందించాలో ఎవ్వరికి అర్థం కాలేదు. దీనికి తోడూ ఆమె తన ఇంటి పెంపుడు కుక్కకు రొట్టె తినిపిస్తున్న వీడియోను సోషల్ మీడియాలో పెట్టి తాను ఓ మథర్ థెరీసా కంటే గొప్ప మానవతా వాదిని అన్నట్లు చాటుకున్నారు.
కానీ వివాదాలను వెంటేసుకుని తిరిగే ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఆమెకు కరెక్ట్ జవాబు చెపుతూ, సోషల్ మీడియాలో ఓ వీడియో పెట్టారు. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అయ్యింది. నగరంలో ఉన్న 5 వేల విధి కుక్కలను ఓ గదిలో వేసి, ఆమెను కూడా ఆ గదిలో వేయమన్నారు. అప్పుడు ఆమె వాటిని ఎలా ప్రేమిస్తారో చూద్దాము అని ఎద్దేవ చేశారు. ఆడవాళ్ళు అంటే తనకు ఏంతో గౌరవం అన్నారు. పొతే మేయర్ విజయలక్ష్మీ అంటే గౌరవం లేదు అని ముక్కు మీద గుద్దినట్లు చెప్పారు.
మేయర్ విజయలక్ష్మీ వితండవాదానికి రాంగోపాల్ వర్మ సరైనా జవాబు చెప్పాడని జనం సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు.