కర్ణాటకలో ఇద్దరు మహిళా ఉన్నతాధికారుల మధ్య నెలకొన్న వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. హుందాగా వ్యవహరించాల్సిన ఐపీఎస్, ఐఏఎస్ అధికారిణులు తమ హోదాలను మరిచిపోయి సోషల్ మీడియా వేదికగా ఫైట్ చేసుకుంటూ పరువు తీసుకుంటున్నారు.
విషయం సీరియస్ గా మారడంతో ప్రభుత్వం జోక్యం చేసుకుంది. ఫేస్ బుక్ లో రూప చేసిన రచ్చ అనంతరం అధికారులు వీరిద్దరిని బదిలీ చేసి, పోస్టింగులు ఇవ్వకుండా పెండింగ్‌లో ఉంచారు. దాంతో పాటు వీరు సోషల్ మీడియాలో ఎలాంటి ఆరోపణలు చేసుకోవద్దని, బహిరంగ ప్రకటనలు ఇవ్వొద్దని కూడా హెచ్చరించారు. అయినా రూప మళ్లీ ఫేస్‌బుక్‌లో పోస్టులు పెడుతున్నారు.
మరోవైపు ఐఎఎస్ రోహిణి సింధూరి ఐపీఎస్ రూప మౌద్గిల్ కు లీగల్ నోటిసులు పంపారు. తనకు క్షమాపణలు చెప్పాలని.. తన పరువుకు భంగం కల్గించేలా సామజిక మధ్యమాలో పోస్టులు చేసినందుకు కోటి రూపాయల పరిహారం చెల్లించాలని కోటి రూపాయల పరిహారం చెల్లించాలని రూపకు రోహిణి సింధూరి పంపిన నోటిసుల్లో పేర్కొన్నారు. తన వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు బయటకు లీక్ చేయడంతో తాను మానసికంగా కుంగుపాటుకు గురయ్యాయని రోహిణి ఆవేదన వ్యక్తం చేశారు. తన గురించి చేసిన పోస్టులను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.
రోహిణి సింధూరి తల్లిదండ్రులు వైసీపీ సానుభూతిపరులు. గతంలో అమరావతి వ్యతిరేక ప్రచారం కోసం రోహిణి తల్లి అమరావతికి వచ్చారు. జగన్ తో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అంటున్నారు.ఈ సాన్నిహిత్యంతోనే డిప్యూటేషన్ పై రోహిణి సింధూరిని ఏపీకి తీసుకొస్తారన్న ప్రచారం జరిగింది. కానీ ఎందుకనో అది ఆగిపోయింది. ఏదీ ఏమైనా ఇద్దరు మహిళా సివిల్ సర్వీసెస్ అధికారుల వ్యవహారం హాట్ టాపిక్ అవుతోంది.