వైఎస్ వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. వివేకాను ఆయనే హత్య చేయించారనే ఆధారాలను సీబీఐ సేకరించినట్లు లీకులు వస్తున్నాయి. ఈ క్రమంలోనే అవినాష్ రెడ్డిని మరోసారి విచారణకు హాజరు కావాలంటూ సీబీఐ నోటిసులు జారీ చేయడం అనుమానాలకు తావిస్తోంది.
ఆసక్తికరమైన విషయం ఏంటంటే..వివేకా హత్య కేసు విచారణకు హాజరు కావాలంటూ అవినాష్ రెడ్డితోపాటు ఆయన తండ్రి భాస్కర్ రెడ్డికి కూడా సీబీఐ నోటిసులు జారీ చేసింది. ఇందులో భాస్కర్ రెడ్డికి ఎక్కడైనా హాజరు కావొచ్చునని ఆయన ఇష్టానికి వదిలేసిన సీబీఐ అధికారులు.. అవినాష్ రెడ్డిని మాత్రం హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయంకు రావాలని ఆదేశించడం ఆయన్ను అరెస్ట్ చేస్తారనే ప్రచారానికి బలం చేకూర్చుతోంది.
ఈ క్రమంలోనే అవినాష్ రెడ్డి ఈ కేసునుంచి బయటకు రావాలంటే బీజేపీలో చేరడం తప్ప ఆయనకు మరో ఆప్షన్ లేదని సోషల్ మీడియాలో ఓ వార్త పేపర్ తో మీమ్స్ క్రియేట్ చేసి వైరల్ చేస్తున్నారు. బీజేపీలో చేరితేనే ఈ కేసు నుంచి అవినాష్ రెడ్డికి విముక్తి లభిస్తుందనే మీమ్ చక్కర్లు కొడుతోంది.
శుక్రవారం సీబీఐ విచారణకు హాజరు కానున్న అవినాష్ రెడ్డి అరెస్ట్ ఖాయమని అంటున్నారు. ఆయన అరెస్ట్ తరువాత కీలక వ్యక్తులను అరెస్ట్ చేసే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఫోన్ కాల్ ఆధారంగా అవినాష్ రెడ్డి దొరికిపొయారని కథనాలు వస్తున్నాయి. ఈ కేసులో ఆయన తప్పించుకోవడం సాధ్యం కాదని అంటున్నారు.
దీనిని చూసిన వారు కూడా ‘అవును.. అవినాష్ రెడ్డిని జగన్ కూడా కాపాడలేరని’ అంటున్నారు. ఇక అవినాష్ రెడ్డి సేఫ్ జోన్ లో ఉండాలంటే బీజేపీ ఆశ్రయం పొందాలని కామెంట్స్ చేస్తున్నారు. అవినీతి, అక్రమాలు చేసిన వారు బీజేపీలో చేరగానే ఎలాగైతే కేసులు మాఫీ అవుతున్నాయో… ఈ మర్డర్ కేసు నుంచి తప్పించుకోవాలంటే బీజేపీలో చేరికే అవినాష్ రెడ్డికి ఏకైక మార్గమని సలహా ఇస్తున్నారు.
మర్డర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి బీజేపీలో చేరుతానంటే ఆయనను చేర్చుకుంటుందా.. అనే అంశంపై కూడా జోరుగా చర్చ జరుగుతోంది. అయితే.. ఏపీలో బలహీనంగా ఉన్న బీజేపీ బలమున్న నేతలను లాగేసుకోవాలని అనుకుంటుంది. కాబట్టి అవినాష్ రెడ్డి బీజేపీలో చేరుతానంటే వద్దంటుందా..? అనే వాదనలు వినిపిస్తున్నాయి. చూడాలి, మరి రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో..!?
Also Read : అవినాష్ రెడ్డి అరెస్ట్ కు రంగం సిద్దం- స్పీకర్ అనుమతి కూడా..?