టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చాక జాతీయ స్థాయిలో పార్టీ ప్రభావం ఉంటుందని భారీ ఆశలు పెట్టుకున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ అమలు చేస్తోన్న పథకాల గురించి జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుందని… రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ లోకి వలసలు భారీ ఎత్తున ఉంటాయని ప్రకటించారు. కానీ అదంతా ఒట్టి ప్రచారమేనని తేలింది.
ఓడిసా మాజీ ముఖ్యమంత్రి , పలువురు బీజేపీ నేతలు బీఆర్ఎస్ లో చేరినా.. పంజాబ్ ముఖ్యమంత్రే స్వయంగా తెలంగాణ అభివృద్ధిపై ప్రశంసల జల్లు కురిపించినా బీఆర్ఎస్ కు ఇతర రాష్ట్రాల్లో అనుకున్న స్థాయిలో హైప్ రావడం లేదు. కారణం.. బీఆర్ఎస్ ను వార్తా సంస్థలు పట్టించుకోకపోవడం. అందుకే బీఆర్ఎస్ కు ప్రమోషన్ కోసం పత్రికలను తీసుకురావాలనుకుంటున్నారు కేసీఆర్.
తెలంగాణలో బీఆర్ఎస్ కు అనుకూల పత్రిక నమస్తే తెలంగాణ ఎలాగైతే ఉందొ.. ఏపీలో నమస్తే ఆంధ్రప్రదేశ్ ను తీసుకురావాలని అనుకుంటున్నారు కేసీఆర్. ఇందుకోసం ఎంతైనా ఖర్చు పెట్టుకునేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిద్దంగానే ఉన్నారు. ఇప్పుడు కావాల్సింది స్టాఫ్ కావడం.. కొన్ని ప్రింటింగ్ యూనిట్లు పెడితే సరిపోతుంది. రెండు, మూడు నెలలో ఈ పని పూర్తి అవుతుంది. రోజురోజుకు పేపర్ లను చదివే వారు తక్కువ అవుతున్నారు. కొత్తతరం వారు ఎంతసేపు ఆన్ లైన్ మాధ్యమం ద్వారా న్యూస్ చూస్తున్నారు. కానీ పేపర్ కొని చదివెందుకు ఆసక్తి చూపించడం లేదు.
అయినప్పటికీ ఏపీలో పత్రిక తీసుకురావాలని కేసీఆర్ అనుకుంటున్నారు. అయినా కేసీఆర్ దగ్గర డబ్బుకు కొదువేముంది. లాభాలతో పని లేదు. కావాల్సింది పార్టీ ప్రమోషన్. ఇందుకోసం నష్టాలు వచ్చినా భరించేందుకు కేసీఆర్ రెడీగానే ఉన్నారు. ఏపీలో మొదట పత్రికను స్టార్ట్ చేసి ఆ తరువాత ఏపీలో సక్సెస్ అవుతే….బీఆర్ఎస్ కీలకమని భావిస్తోన్న రాష్ట్రాల్లోనూ పత్రికలను తీసుకురావాలని అనుకుంటున్నారు. ఇందుకు సంబంధించి ప్రగతి భవన్ నుంచి లీక్ లు వస్తున్నాయి.