ఏపీ సీఎం జగన్ చిన్నాన్న వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు కొనసాగిస్తోంది. ఈ కేసులో అసలు సూత్రధారులు, పాత్రధారులెవరో తేల్చే పనిలో పడింది. సునీల్ యాదవ్ ను విచారించిన సీబీఐ పలు ఆధారాలను సేకరించింది. ఇందులో అవినాష్ రెడ్డి ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిల గుట్టు మొత్తం బయటపడినట్లు స్పష్టమైంది.
వివేకా హత్యకు గురయ్యే ముందు హైదరాబాద్ లోటస్ పాండ్ నుంచి పులివెందులకు వచ్చారు. టికెట్ల అంశంపై చర్చినేందుకు ఆయన లోటస్ పాండ్ వెళ్ళారు. అక్కడి నుంచి వచ్చిన తరువాత ఈ హత్య జరిగింది. ఈ మర్డర్ ప్లాన్ చాలా పకడ్బందీగానే జరిగినట్లు ఆ తరువాత తేలింది. మొదట గుండెపోటు అని , ఆ తరువాత చంద్రబాబు హత్య చేయించారని కాదు.. ఆదినారాయణ రెడ్డి హత్యా చేయించారని లేదు.. బీటెక్ రవి మర్డర్ చేయించారని ఇలా ఎన్నో ఆరోపణలు వచ్చాయి. కట్ చేస్తే అయిన వాళ్ళే హత్య చేయించారని మెల్లమెల్లగా అర్థం అవుతోంది.
ఇటీవల అవినాష్ రెడ్డికి సీబీఐ నోటిసులు జారీ చేసింది. ఆయన విచారణకు హాజరై వచ్చారు. మరోసారి నోటిసులు ఇచ్చి విచారణకు హాజరు కావాలని కోరింది సీబీఐ. ఈ నెల 24వ తేదీన (శుక్రవారం ) హైదరబాద్ లోని సీబీఐ అఫీసుకు రావాలని నోటిసుల్లో పేర్కొన్నారు. అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డికి కూడా నోటిసులు ఇచ్చారు కానీ విచారణకు హాజరయ్యే ప్రాంతం విషయంలో ఆయన ఇష్టానికే వదిలేశారు. అవినాష్ రెడ్డి మాత్రం హైదరాబాద్ లోనే విచారణకు హాజరు కావాలని నోటిసులో పేర్కొనడంతో ఆయన అరెస్ట్ ఖాయమని ప్రచారం జరుగుతోంది.
వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి అరెస్ట్ తరువాత మరిన్ని అరెస్ట్ లు కూడా ఉంటాయన్న ప్రచారం కూడా జరుగుతోంది. వివేకా హత్య జరిగిన సమయంలో తెల్లవారుజామున 3గంటలకు అవినాష్ రెడ్డి జగన్ , భారతి పీఏ లకు ఎందుకు ఫోన్లు చేశాడు..? ఏం మాట్లాడుకున్నారన్నది సీబీఐ తేల్చనుంది. ఆ తరువాత కీలక వ్యక్తులను కూడా విచారణకు పిలిచే అవకాశం కనిపిస్తోంది.
Also Read : అవినాష్ రెడ్డి అరెస్ట్ కు రంగం సిద్దం- స్పీకర్ అనుమతి కూడా..?
Also Read : వైఎస్ విజయమ్మతో అవినాష్ రెడ్డి భేటీ