ఈ ఏడాది తొమ్మిది రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ తొమ్మిది రాష్ట్రాల్లో…ఒక్క రాష్ట్రంలో బీజేపీ అధికారం చేజిక్కించుకొకపోయినా ఆ ప్రభావం పార్లమెంట్ ఎన్నికలపై పడుతుంది. అందుకే 2023 బీజేపీకి అత్యంత క్లిష్టమైన సవాల్ విసురుతోంది.
ఎన్నికలకు ఇప్పటి నుంచే బీజేపీ వ్యూహప్రతివ్యూహాలను సిద్దం చేస్తోంది. తొమ్మిది రాష్ట్రాల్లో గెలిచి సత్తా చాటాలని భావిస్తోంది. ఇందుకోసం శక్తివంచన లేకుండా కృషి చేయాలని బీజేపీ అధినాయకత్వం రాష్ట్ర నాయకత్వాలకు సూచిస్తోంది. ఏమాత్రం తేడా వచ్చిన మొదటికే మోసం వస్తుందని.. అందుకే ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్దం కావాలని ఆదేశిస్తున్నారు.
తొమ్మిది రాష్ట్రాల్లో ఎన్నికలు ఈ ఏడాది మొత్తం జరగనున్నాయి. ప్రస్తుతం బీజేపీ బలంగా ఉంది. ఈశాన్య రాష్ట్రాలను మినహాయిస్తే కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్ , తెలంగాణ పెద్ద రాష్ట్రాలు. కర్ణాటక, మధ్యప్రదేశ్‌లో బీజేపీ అధికారంలో కొనసాగుతోంది. రాజస్థాన్, చత్తీస్ ఘడ్‌లలో కాంగ్రెస్ అధికారంలో ఉంది.
ఇప్పుడు బీజేపీ టార్గెట్ ఒకటే. కర్ణాటక , మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో అధికారం నిలబెట్టుకోవడంతోపాటు చత్తీస్ ఘడ్ , రాజస్తాన్ లో అధికారంలోకి రావాలనేది బీజేపీ లక్ష్యం. ఈశాన్య రాష్ట్రాల్లో కూడా బీజేపీ అధికారాన్ని ఏర్పాటు చేసుకోవాలి. తేడా వచ్చి ఒక్క రాష్ట్రంలో నిరాశాజనకమైన ఫలితాలు వచ్చినా అది బీజేపీ పతనానికి నాంది పలకనున్నాయి.
తెలంగాణలోనూ అధికారంలోకి వస్తామని బీరాలు పలుకుతున్నారు. కాని పరిస్థితి బీజేపీకి అంత ఫేవర్ గా ఏమి లేదు. రేవంత్ పాదయాత్ర తరువాత సీన్ మారే అవకాశం ఉంది. కాబట్టి.. ఈ తొమ్మిది రాష్ట్రాల్లో బీజేపీ ప్రచారం చేసుకుంటున్నట్లుగా అధికారాన్ని ఏర్పాటు చేయకపోతే.. ఆ ప్రభావం వచ్చే ఏడాది జరగనున్న లోక్ సభ ఎన్నికల పడుతుంది.
కేంద్రంలో బీజేపీ మరోసారి అధికారాన్ని ఏర్పాటు చేయాలనుకుంటుంది. ఇందుకోసం ప్రణాళిక బద్దంగా పని చేసుకుంటూ పోతున్నారు. కేంద్రంలో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలంటే ముందుగా ఈ తొమ్మిది రాష్ట్రాల్లో గెలిచి తీరాలి. కాని సిట్యూయేషన్ బీజేపీకి అంత అనుకూలంగా ఏమి లేదు. ఈ విషయం బీజేపీ అగ్రనాయకత్వానికి కూడా తెలుసు. అందుకే ఈ మధ్య పదేపదే రాష్ట్రాల నాయకత్వాలను అలర్ట్ చేస్తోంది.
గుజరాత్‌లో బీజేపీ ఏకపక్ష విజయం సాధించినా హిమాచల్ ప్రదేశ్ లో మాత్రం అధికారం కోల్పోయింది. గతంలోలా మోదీ మేనియా పని చేస్తుందా..? అంటే కష్టమే. అందుకే ఈ ఏడాది బీజేపీకి కఠిన పరీక్షగా తెలుస్తోంది. ఈ తొమ్మిది రాష్ట్రాల్లో బీజేపీ గెలవకపోతే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి శుభం కార్డు పడినట్లే.
Also Read : ఎన్నికల ఏడాది – తొమ్మిది రాష్ట్రాల్లో హస్తం హవా..!