111 జీవోని ఎత్తివేసే విధంగా జీవో 69ని ఆగమేఘాల మీద తీసుకొచ్చారు సిఏం కేసీఆర్. గతంలో అసెంబ్లీలో మాట్లాడుతూ 111 జీవో ఎత్తేస్తాం కమిటీ రిపోర్ట్ వస్తుందని అన్నారు. ఆ రిపోర్ట్ ఏమయిందో తెలీదు. 111 జీవో కేసీఆర్ సొంత ఎస్టేట్ పంచాయితా ? Apex comitte రిపోర్ట్ ని తెలంగాణ సమాజం, అసెంబ్లీ వేదిక బహిర్గతం చేయకుండా సొంత ఇంటి వ్యవహారంలా జీవోలని తీసుకురావడం ఎంత వరకూ న్యాయం ? అని ప్రశ్నించారు దాసోజు.
”1,32,600 ఏకరాల భూమి111జీవో పరిధిలో వుంది. ఇందులో లక్ష ఎకరాలు టీఆర్ఎస్ పార్టీ చెందిన పెద్దలే బెదిరించి కొనుకున్నారు. ఇప్పుడు వారి మేలు చేస్తూ జీవోని ఎత్తేసే కార్యక్రమం చేస్తున్నారు. ఈ జీవో చదివితే కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. ఇంత దారుణమా ? భవిష్యత్ తరాలకు నీరు అందించే సరస్సులని మింగేసే ఆలోచన చేయడం దారుణం. అసలు ఈ జీవో అమలైతే పర్యావరణం, జలాశయాలని ఎలా కాపాడాలి ?
మంచి నీరు అందించే సరస్సులని ఎలా రక్షించాలి ? మొత్తం విధివిధానాలు తయారుచేసి అమలు చేసిన తర్వాత జీవో ఎత్తివేత గురించి అలోచించాలి. కానీ రాత్రిరాత్రికే జీవో తెచ్చి సోమేశ్ కుమార్ సారధ్యంలో కమిటీ వేస్తున్నట్లు చెబుతున్నారు. ఇంతకంటే తలకుమాసిన పరిపాలన విధానం మరొకటి వుండదు.
టీఆర్ఎస్ పార్టీ నాయకులు, పార్టీకి కొమ్ముకాసే వ్యక్తులు భూములు కొనుకున్నారు కాబట్టి ఈ రోజు అన్యాయంగా జీవోని తీసుకొచ్చారు. 69జీవో హై కోర్టు ఇచ్చిన తీర్పులకు విరుద్దం. గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పుకు విరుద్దం కాబట్టి ఈ జీవో వెంటనే వెనక్కి తీసుకోవాలి” అని డిమాండ్ చేశారు దాసోజు