మహా భారతంలో దృతరాష్ట్రుడికి 101 పిల్లలకు జన్మనిచ్చాడు అని మనం చదువుకున్నాము. అది ఎలా సాధ్యం అని అడిగితే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెపుతారు. అతని చమటను (వీర్యం) 100 కుండలల్లో వేయడంవల్ల కౌరవులు పుట్టారు అని కొందరు అంటారు. అది లాజిక్కి అందవు, హేతువాదుల ముందు నిలువవు. దానిని కాసేపు పక్కన పెడదాము.
కానీ నేటి కలియుగంలో 550 పిల్లలకు జన్మనిచ్చిన ఓ దృతరాష్ట్రుడికి గురించి తెలుసుకుందాము. ఇది కల్పితం కాదు. నెదర్లాండ్స్ దేశం లోని ‘ది హేగ్’ అనే నగరంలో జోనాధన్ అనే డాక్టర్ ఉన్నాడు. ఇతని వయసు 41 ఏళ్ళు. మనం రక్త దానం చేస్తే ఎంత పుణ్యం అనుకుంటామో, వీర్యం దానం చేయడం కూడా అంతే పుణ్యం అని అతను అనుకున్నాడు.
ఆ దేశంలో ‘స్పెర్మ్ బ్యాంకు’లు విరివిగా ఉన్నాయి. అంటే ‘వీర్యం బ్యాంకు’లు. మగవాళ్ళు దానం చేసే వీర్యాని బ్యాంకు లో ఏళ్ల తరబడి దాస్తారు. గర్భం దాల్చాలి అనుకునే ఆడవాళ్ళు ఆ బ్యాంకు నుంచి వీర్యం కొని పిల్లలను కంటారు. ఇది చట్టం ప్రకారం జరుగుతుంది. భర్తవల్ల పిల్లు పుట్టని భార్యలు, పెళ్లి చేసుకోకుండా పిల్లలను కనాలి అనుకునే ఆడవాళ్ళు, మొగుడు లేని ఆడవాళ్ళు ఇక్క వీర్యం కొని గర్భం దాలుస్తారు.
డాక్టర్ జోనాధన్ కూడా తన వీర్యాని ప్రపంచంలోని 13 బ్యాంకు లకు దానం చేశాడు. ఓ బ్యాంకు నుంచి బోరా అనే మహిళ డాక్టర్ జోనాధన్ వీర్యంతో ఓ బిడ్డకు జన్మనిచ్చింది. కొన్ని దేశాలల్లో వీర్యం దానం చేసిన వాళ్ళ వివరాలు గోప్యంగా దాస్తారు. మరి కొన్ని దేశాలల్లో గోప్యత ఉండరు. వీర్యం దానం చేసిన మగాడి మతం, కులం, ఉద్యోగం, చదువు లాంటి వివరాలు ముందే తెలుసుకునే వెసులుబాటు ఉంటుంది.
అక్కడివరకు బాగానే ఉంది. ఆమెకు పుట్టిన బిడ్డ ఆకారంలో మరికొందరు బిడ్డలు దారిలో కనిపించరు. ఆమె ఆందోళన చెంది ఆ పిల్లల పుట్టు పోర్వోత్తరాలు ఆరా తీసింది. వీర్య దానంతో పుట్టిన ఆ పిల్లలకు తండ్రి కూడా డాక్టర్ జోనాధన్ అని తెలిసింది. ఇంకా లోతుకి వెళ్ళితే అలాంటి పిల్లలు 550 మంది అతనివల్ల పుట్టారని తెలిసింది. ఆ పిల్లలందరూ ప్రిటింగ్ మిషిన్ నుంచి వచ్చినట్లు ఒకే పోలికలతో ఉన్నారు. అంటే ‘రాముడు – భీముడు’, ‘హలో బ్రదర్’ లాగ మల్టి డ్యూయల్ రోల్లో కనిపించారు. ఇలాంటి వాళ్లతో మునుముందు ఎన్నో సమస్యలు రావచ్చు.
ఒళ్ళు మండిన ఆమె వెంటనే అతని మీద క్రిమినల్ కేసు పెట్టింది. ఇలాంటి అవాంతరాలు రాకూడదనే ‘వీర్య దానం చట్టం’లో ఓ నిబంధన ఉన్నది. ఒక మగాడి వీర్య దానం చేసి కేవలం 12 మంది కి మాత్రమే జన్మను ఇవ్వాలి. దానిని అతను అతిక్రమించాడు అని తేలింది. అందుకే ‘ది డచ్ సొసైటీ ఆఫ్ ఆబ్రేటిక్స్ అండ్ గైనకాలజీ (ఎన్ వి ఓ జి) అతనిని బ్లాకు లిస్టు లో పెట్టింది. అతని మీద పోలీస్ కేసు నడుస్తోంది. డాక్టర్ జోనాధన్ ఇప్పుడు కెన్యాకు పారిపోయినట్లు తెలిసింది.