ప్రభుత్వ పాఠశాలలు పేద విద్యార్థులకు గుడులు. పాఠశాలలో ఉపాధ్యాయులే దైవం. వారు చేసే బోధనలే జీవితంలో ఎదిగేందుకు సోపానం. ఎందుకంటే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర: అన్నారు పెద్దలు. అంతటి గురువు ఉండే ప్రదేశం కాబట్టే పాఠశాలలను విద్యాలయాలుగా కూడా పిలుస్తారు. అంతేకాదు పిల్లలను కూడా దేవుడి స్వరూపాలుగా భావిస్తారు. అలాంటి వారు ఉంటే పాఠశాలల నిర్వహణ ఎంతో పవిత్రంగా ఉండాలి. ఆహ్లాదకరమైన వాతావరణం అక్కడ కల్పించాలి. ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ఎటువంటి సమస్యలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకే సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఓ అడుగు ముందుకు వేసింది. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తోడ్పాటును ఇవ్వాలని నిర్ణయించుకుంది.
తీసుకున్న నిర్ణయాన్ని ఆచరణలో పెట్టేందుకు సానా సతీష్ బాబు ఫౌండేషన్ ముందుగా కాకినాడలోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలను గుర్తించింది. కేవలం గుర్తించడమే కాకుండా వాటిల్లో నెలకొన్న సమస్యలను నోట్ చేసుకుంది. వాటిని పరిష్కరించాలని సంకల్పించింది. అనుకున్నదే తడవుగా సానా సతీష్ బాబు గారి ఆధ్వర్యంలో ప్రణాళికలను రూపొందించి అమలు చేసింది. పాఠశాలలకు అవసరమైన ఫర్నిచర్, విద్యుత్ పరికరాలు, ఇతర వసతులను కల్పించింది. తద్వారా ఉపాధ్యాయులు, విద్యార్థులు ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉండేలా అన్ని వసతులను సమకూరుస్తోంది. ఇందుకు సానా సతీష్ బాబు గారు పూర్తి బాధ్యతను వహిస్తూ చదువుల పట్ల తనకున్న అంకిత భావాన్ని, విద్యార్థుల పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకుంటున్నారు. అంతేకాకుండా మెరుగైన వసతులున్నప్పుడే విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టేందుకు వీలుంటుందను సానా సతీష్ బాబు గారు విశ్వసిస్తారు. పేద కుటుంబాల విద్యార్థులు చదువుకు దూరం కాకుండా ఉండేందుకు తన పూర్తి సహాయ సహకారాలు అందిస్తారు.
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి వెనుక సానా సతీష్ బాబు గారికి ఒక దీర్ఘకాలిక ప్రణాళిక కూడా ఉంది. అదేమిటంటే మెరుగైన వసతులు, సౌకర్యాలతో పాటు విలువలతో కూడిన విద్య అందినప్పుడు ఉత్తమమైన భావజాలం కలిగిన భావి భారత పౌరులు తయారైతారు. అటువంటి పౌరులు దేశంతో పాటు రాష్ట్రం,