ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవాలంటే నైతికంగా, మానసికంగా, విషయ పరంగా బలమైన పునాదులు పడాలి. అది కేవలం విద్యార్థి దశలోనే సాధ్యపడుతుంది. అందుకే పెద్దలు పనికి, పిల్లలు బడికి అని అంటారు. కానీ నిరుపేద కుటుంబాల్లో పిల్లలకు చదువు అనేది అందనంత దూరంలో ఉంటుందనేది జగమెరిగిన సత్యం. రెక్కాడితేగాని డొక్కాడని పరిస్థితి వారిది. అటువంటి దయనీయ స్థితిలో పిల్లలను బడికి పంపి చదివించడం అంటే వారికి తలకు మించిన భారంగా అనిపిస్తుంది. అందుకే చాలా మంది నిరుపేద తల్లిదండ్రులు తమ పిల్లలను బడి బాట పట్టించకుండా పనికి పంపిస్తుంటారు. పిల్లలు, పెద్దలు ఇద్దరూ పనికే వెళ్తారు.
ఒకవేళ బడికి పంపినా కూడా వారికి సరైన యూనిఫాంలు, స్టేషనరీ కూడా అందించలేరు. దీంతో పేద కుటుంబానికి చెందిన పిల్లలు చదువులో వెనుకబడి పోతారు. ఇతర విద్యార్థుల్లానే చదువులో రాణించలేరు. అటువంటి పిల్లల పరిస్థితి సానా సతీష్ బాబు ఫౌండేషన్ వ్యవస్థాపకులు, సానా సతీష్ బాబు గారిని ఎంతగానో కదిలించింది. పేద పిల్లలకు చదువును దగ్గర చేయాలనే ప్రేరణను కల్పించింది. అనుకోవడమే ఆలస్యం సానా సతీష్ బాబు ఫౌండేషన్ ద్వారా సహాయం చేయడం కూడా ఆయన ప్రారంభించి వందలాది మంది విద్యార్థులకు అండగా నిలుస్తున్నారు.
కాకినాడలోని వివిధ పాఠశాలలకు చెందిన వెయ్యి మందికి పైగా విద్యార్థులకు బస్సు పాసులను ఉచితంగా అందిస్తున్నారు. తద్వారా దూర ప్రాంతాల నుంచి పాఠశాలకు వెళ్లే విద్యార్థులకు ప్రయాణ ఖర్చుల భారం తగ్గిస్తున్నారు. దీంతో లబ్ధిపొందిన విద్యార్థులు ఫౌండేషన్ సహాయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఇద్దరు అనాథ విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం భరోసాను కల్పించారు సానా సతీష్ బాబు గారు. అనాథలైన 9ఏళ్ల లేఖన అనే బాలిక, 14ఏళ్ల కెవిఆర్ ప్రసాద్ అనే బాలుడి పేరిట ఒక్కొకరికి రూ.1.50 లక్షల రూపాయల బ్యాంక్ డిపాజిట్ చేశారు. తద్వారా వారి భవిష్యత్తు కోసం భరోసానిచ్చారు. ఇది మాత్రమే కాదు ఆదిత్యకుమార్ అనే విద్యార్థికి ఇంజనీరింగ్ విద్య చదివేందుకు ఆర్థిక చేయూతను అందిస్తున్నారు. ఇలా ఇంకెందరో విద్యార్థుల భవిష్యత్తును సానా సతీష్ బాబు గారు తమ ఫౌండేషన్ తరపున తీర్చిదిద్దుతున్నారు. ఒక విద్యావంతునిగా, చదువు విలువ తెలిసిన