సానా సతీష్ బాబు ఒక నిత్య విద్యార్థి. జీవితంలో ఎదురయ్యే అనుభవాలు, పరిస్థితుల నుంచి పాఠాలను ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ముందుకు సాగుతారు. పఠనం, అభ్యాసమే కాదు ఆచరణ కూడా ఎంతో నిబద్ధతతో చేసి చూపుతారు. ఎందుకంటే ఎంత నేర్చుకున్నా నేర్చుకోవాల్సింది ఇంకా మిగిలే ఉందని సతీష్ బాబు విశ్వసిస్తారు. ఏదైనా సరే నేర్చుకుంటే సరిపోదు దానిని ఆచరణలో పెట్టినప్పుడే సార్థకతగా భావిస్తారు. అందుకే నేర్పరిగా మాత్రమే కాదు ఆధునిక యుగపు ఏకలవ్యుడిగా కూడా సతీష్ బాబును చాలా మంది అభివర్ణిస్తారు. పునాదులు బలంగా ఉన్నప్పుడే నిర్మాణం మన్నికగా ఉంటుంది. అలాగే విద్యార్థి దశలో నైతిక విలువలు, శ్రవణ పఠనాసక్తులు, జిజ్ఞాస అనేవి పరిపుష్టి అయితే జీవితంలో ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు అనేందుకు సానా సతీష్ బాబు జీవితమే కంటి ముందు కనిపిస్తున్న నిజమైన సాక్ష్యంగా చెప్పుకోవచ్చు. ఇంటి నుంచి పాఠశాలకు, కళాశాలకు ఎంతో దూరం ఉన్నా కూడా ఆయన ఎన్నడూ చదువుకు దూరం కాలేదు. కిలోమీటర్ల కొద్ది నడచుకుంటూ విద్యాలయాలకు వెళ్లేవారు. చదువంటే అంతటి మక్కువ సానా సతీష్ బాబుకు. అందుకే కాకినాడలోని పేద విద్యార్థులకు అండగా నిలవడానికి, ప్రతిభావంతులైన విద్యార్థులు జీవితంలో ఉన్నతంగా ఎదిగేందుకు తోడ్పాటునివ్వడానికి సానా సతీష్ బాబు ఫౌండేషన్ ద్వారా అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నారు.
కేవలం ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడానికే సానా సతీష్ బాబు ఫౌండేషన్ పరిమితం కాలేదు. అందులో చదివే పేద విద్యార్థుల కుటుంబాల కష్టాలను కూడా గుర్తించింది. ఆ పిల్లల చదువు కోసం తల్లిదండ్రులు చేస్తున్న రెక్కల కష్టాన్ని అర్థం చేసుకుంది. చాలా మంది విద్యార్థులు దూర ప్రాంతాల నుంచి వ్యయప్రయాసలు ఒనగూర్చి పాఠశాలలకు రావడాన్ని తెలుసుకొని చలించిపోయింది. సానా సతీష్ బాబు కూడా తాను చదువుకునే రోజుల్లో విద్యాలయాలకు నడుచుకుంటూ వెళ్లేవారు. అలాంటి పరిస్థితి పేద విద్యార్థులకు రాకూడదని కాకినాడలోని వెయ్యి మంది పేద విద్యార్థులను సానా సతీష్ బాబు ఫౌండేషన్ గుర్తించింది. ప్రతి సంవత్సరం వారందరికీ ఉచితంగా బస్సు పాసులను అందజేస్తోంది. ఇలా ఫౌండేషన్ తరపున ఉచిత బస్సు పాసులను అందుకునే వారు వెయ్యికి పైగానే ఉంటారు. ఆ విద్యార్థులందరూ ఫౌండేషన్ తరపున సానా సతీష్ బాబు చేస్తున్న సేవలకు