ప్రభుత్వ ఉద్యోగి నుంచి వ్యాపారవేత్తగా ఎదిగిన అసామాన్యులు సానా సతీష్ బాబు. విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఉన్నతాధికారులు, ప్రభుత్వ పెద్దల మన్ననలను అందుకున్నవారు. తన నిజాయితీని, నిబద్ధతను కొనసాగిస్తూ ప్రతి రంగంలో తనదైన ముద్రను వేస్తున్నారు. ఓ ఉద్యోగిగానే కాదు ఓ వ్యాపారవేత్తగా కూడా తాను ఎంతో ప్రత్యేకమని ప్రతి క్షణం నిరూపించుకుంటున్నారు. రంగం ఏదైనా తనదైన ముద్రను వేస్తూ చుట్టూ ఉన్న వారిని విస్మయ పరుస్తున్నారు. తన అసామాన్య విజయాలతో ఆశ్యర్యానికి లోనయ్యేలా చేస్తున్నారు. అడుగు పెట్టిన ప్రతి చోట విజయ దుందుభి మోగిస్తూ తిరుగులేని శక్తిగా ఎదుగుతున్నారు సానా సతీష్ బాబు గారు. అందుకే ఆయనంటే పరిచయస్తులకు ప్రేమ, తెలిసిన వారికి అభిమానం. సాయం పొందిన వారికి దైవంతో సమానం. ఎక్కడకు వెళ్లినా జన నీరాజనాలు ఆయనకు సొంతం. పెద్దల ఆశీస్సులతో, ప్రజల ఆదరణతో దినదినాభివృద్ధి చెందుతున్న ధృవ నక్షత్రం మన సానా సతీష్ బాబు.
జీవితంలో గొప్ప లక్ష్యాలను సాధించాలంటే కొన్ని త్యాగాలు చేయాలని బలంగా విశ్వసిస్తారు సానా సతీష్ బాబు గారు. అటువంటి ఎన్నో త్యాగాలను చేసి ఉన్నత స్థాయికి చేరారు. ఆయన వ్యాపారవేత్తగా ఎదగడం వెనుక ఎన్నో సంవత్సరాల శ్రమ ఉంది. ఆటుపోట్లను ఎదుర్కొని వ్యాపార రంగ ఒడ్డుకు చేరుకున్నారు. అంతటితో ఆగకుండా తనకంటూ ఓ సామ్రాజ్యాన్ని నిర్మించేందుకు సంకల్పించారు. సుస్థిరమైన పునాదులను బలపరచుకొని వ్యాపార విస్తరణకు వడివడిగా అడుగులు వేశారు. వ్యాపారవేత్తగా ఎదగాలనే ఆయన సంకల్పించిన రోజు, చేతిలో సరైన పెట్టుబడి కూడా లేదు. ఉద్యోగానికి కూడా రాజీనామా చేశారు. ఎలా ముందుకు వెళ్లాలో తెలియని పరిస్థితి. కానీ సతీష్ బాబు తన ఆత్మ విశ్వాసాన్ని ఎక్కడా కోల్పోలేదు. తనను తాను నమ్ముకొని నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్ మహానగరానికి చేరుకున్నారు. నిర్మాణ రంగంలో పెట్టుబడులను పెట్టారు. వ్యాపార అనుభవం లేకపోయినప్పటికీ వెనుకడుగు వేయలేదు. ప్రారంభించిన పనుల్లో ఒడిదుడుకులు ఎదురైనా కూడా ఏ మాత్రం తగ్గలేదు. వైఫల్యాలు చుట్టు ముట్టినా కూడా సతీష్ బాబు తన ఆత్మ స్థైర్యాన్ని ఎన్నడూ కోల్పోలేదు. ఇంతింతై వటుడింతై అన్న తీరులో ఎదుగుతూ వచ్చారు. మరింత పట్టుదలతో వ్యాపార రంగంలో ముందుకు సాగారు.
సానా సతీష్ బాబు సంకల్పానికి, శ్రమకు ఫలితం దక్కింది. వైఫల్యాల నుంచి నేర్చుకున్న పాఠాలను విజయానికి సోపానాలుగా మలచుకున్న ఆయన అనతి కాలంలోనే అతి పెద్ద వ్యాపారవేత్తగా ఎదిగారు. ట్రేడింగ్, పవర్ అండ్ ఎనర్జీ, ఐటీ, ఫుడ్ అండ్ బేవరేజెస్, సీ పోర్టు రంగాల్లో జయకేతనం ఎగురవేశారు. పారిశ్రామికవాడలో దిగ్గజ వ్యాపారవేత్తగా, పారిశ్రామికవేత్తగా కీర్తి గడించారు. కార్పొరేట్ స్థాయికి ఎదిగి ఇక వెను చూసుకోలేదు.. అనుకున్నది సాధించాను, ఇంతటి చాలు అని భావించలేదు సానా సతీష్ బాబు. కేవలం వ్యాపారానికే పరిమితం అవ్వకుండా సొంతూరైన కాకినాడకు సేవ చేయడానికి సానా సతీష్ బాబు ఫౌండేషన్ స్థాపించారు. సామాజిక బాధ్యతతో పాటు ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో పనిచేస్తూ నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఎంతో మందికి ఆప్తమిత్రులుగా మారి ఆదరాభిమానాలను చూరగొంటున్నారు.