టిఆర్ఎస్ పార్టీని కెసిఆర్ బిఆర్ఎస్ గా మార్చిన విషయం అందరికి తెలిసిందే. దీనికి ఎన్నికల కమిషన్ గుర్తింపు వచ్చినప్పటికీ లోక్ సభ నుంచి ఇంకా గుర్తింపు రాలేదు. ఇది కెసిఆర్ కి పెద్ద షాకింగ్ వార్తే. బిఆర్ఎస్ నుంచి టిఆర్ఎస్ ని తొలగించింది. టిఆర్ఎస్ పార్టీని బిఆర్ఎస్ పార్టీ గా లోక్ సభ సచివాలయం ఇంకా గుర్తించలేదు. ఆ పార్టీ ఎంపి నామా నాగేశ్వరరావు బిఆర్ఎస్ పార్టీ సభ్యునిగా ఉన్నారు. ఈ రోజు జరిగిన సమావేశానికి ఆయనకు లోక్ సభ సచివాలయం ఆహ్వానం పంపింది. అందులో ఆయనను ఇంకా టిఆర్ఎస్ ఎంపి గానే పేరు ఉంది.
లోక్ సభ సచివాలయంలో తరచూ బిజినెస్ ఆడ్వైజరి కమిటి (బిఏసి) సమావేశాలు జరుగుతాయి. అన్ని ప్రతిపక్షాల నుంచి ఎంపి లను పిలిచి వాళ్ళ అభిప్రాయాలు తీసుకుంటాయి. జాతీయ పార్టీల నుంచి ఎక్కువ మందిని, ప్రాంతీయ పారీలనుంచి ఒక్కర్ని మాత్రమే పిలుస్తారు.
అయితే ఒక ప్రాంతీయ పార్టీకి జాతీయ పార్టీగా గుర్తింపు ఇవ్వాలంటే కనీసం 6 మంది ఎం పిలు ఉండాలి. కానీ టిఆర్ఎస్ పార్టీకీ 9 మంది ఎంపిలు ఉన్నారు. అయినా లోక్ సభ సచివాలయం జాతీయ పార్టీ గుర్తింపు ఇవ్వక పోవడం ఆశ్చర్యకరం. ఒకవేళ జాతీయ పార్టీ గుర్తింపు ఇస్తే టిఆర్ఎస్ నుంచి ఎక్కువ మంది ఎంపి వచ్చి ఆ మీటింగ్ ని రసాబాసగా మార్చే అవకాశం ఉంది. అందుకే బిజెపి కుట్ర పూరితంగా ఇంకా తమకు జాతీయ పార్టీ గుర్తింపు ఇవ్వడంలేదని టిఆర్ఎస్ పార్టీ ఎంపి లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.