క్రీడాభిమానం – క్రీడాకారులకు ప్రోత్సాహం
క్రీడాస్ఫూర్తి అనే మాట తరచూ వినిపిస్తుంటుంది. అంటే గెలుపు, ఓటములను సమానంగా తీసుకోగలిగే మానసిక సామర్థ్యం అన్నమాట. అంతేకాదు మరోసారి గెలిచేందుకు ప్రయత్నం చేయాలనే తపన కూడా. అలాంటి క్రీడాస్ఫూర్తికి నిలువెత్తు నిదర్శనం మన సానా సతీష్ బాబు గారు. అందుకే జీవితంలో ఎన్ని కష్టాలు ఎదుర్కున్నా విజయాలను సాధించేందుకు ముందుకు సాగారు. అనుకున్న లక్ష్యాలను సాధించారు.
సతీష్ బాబు గారికి చిన్ననాటి నుంచి క్రీడలంటే ఎంతో ఇష్టం. ముఖ్యంగా క్రికెట్ ఆట అంటే ఎనలేని అభిమానం. కానీ మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఆయన క్రీడలకంటే కూడా చదువుకు ప్రాధాన్యం ఇవ్వాల్సి వచ్చింది. చదువుకునే సమయంలో తూర్పు గోదావరి జిల్లా స్థాయి అండర్ – 15 టీంలో క్రికెట్ ఆటగాడిగా గుర్తింపు పొందారు. అనంతరం కుటుంబ సభ్యుల సూచనల మేరకు ఉన్నత విద్యపై శ్రద్ధ పెట్టారు. అలా క్రీడలకు దూరమయ్యారు. ఉన్నత విద్యాభ్యాసం అనంతరం ప్రభుత్వ ఇంజనీరుగా ఉద్యోగ ధర్మాన్ని నిర్వహించి గొప్ప పేరును గడించారు. పది సంవత్సరాల ఉద్యోగ విధి నిర్వహణ అనంతరం వ్యాపారం చేసేందుకు పదవీ విరమణ పొందారు. తరువాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్ లో వ్యాపారాన్ని ప్రారంభించారు. ఎన్నో ఆటుపోటులను దాటుకుంటూ జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించారు. అనతికాలంలోనే గొప్ప వ్యాపారవేత్తగా, పారిశ్రామికవేత్తగా ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. అందుకు ప్రధాన కారణంగా ఆయనలోని క్రీడాస్ఫూర్తి సజీవంగా ఉండడమేనని చెప్పుకోవచ్చు.
అందుకే వ్యాపారవేత్తగా ఎదిగిన తరువాత 2003-2011 వరకు తూర్పు గోదావరి క్రికెట్ అసోసియేషన్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శిగా కూడా బాధ్యతలను నిర్వర్తించారు. తనకు లాగా ఔత్సాహిక క్రీడాకారులు నిరుత్సాహానికి లోనవ్వద్దనే ఆలోచనతో గ్రామీణ ప్రాంత యువతను సైతం క్రికెట్ ఆటలో ప్రోత్సహించారు. వారు క్రీడాకారులుగా ఎదగడానికి కావాల్సిన అన్ని అవకాశాలను కల్పించారు. ఎంతో మంది క్రీడాకారులను రంజీ, రాష్ట్ర స్థాయి ఆటగాళ్లుగా తీర్చిదిద్దారు.
తూర్పు గోదావరి జిల్లా నుంచి ఆంధ్ర రంజీ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఎ.ఎస్.కె.వర్మ, ఇజ్రాయెల్ రాజు, ఎ.వీరబాబు, ఎం. కృష్ణమూర్తి, కె.రవిశంకర్,