మామూలుగా దొంగలకు ఇండ్లకు కన్నాలేసి దోచుకుంటారు. అదే నియోజకవర్గానికి కన్నాలేసే ఎమ్మెల్యే ఉంటే అడుగడుగునా దోపిడీ, అక్రమాలు షరా మాములుగా ఉంటాయి. మరి అలాంటి ఎమ్మెల్యే ఒకరున్నారంటారు కాకినాడ రూరల్ నియోజకవర్గ ప్రజలు. సొంత ఎమ్మెల్యేనే వారు అంత మాట అనడానికి కారణం లేకపోలేదు. కన్నాలేసే వారే దగ్గరే కన్నబాబు కమీషన్లు తీసుకుంటారట. అందుకే ఎమ్మెల్యే కురసాల కన్నబాబుకు కన్నాల బాబు అని ముద్దు పేరు పెట్టుకున్నారు కాకినాడ రూరల్ ప్రజలు. దోచుకోవడం, దాచుకోవడం మంచి నేర్పరని అంటారు. అక్కడా ఇక్కడా అని లేదు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ దోపిడీకి తెగబడతారట కన్నబాబు. పేదలను ఇళ్ళ స్థలాల పేరిట మోసం చేయడం మొదలు, తక్కువకు కొనుగోలు చేసి ప్రభుత్వానికి ఎక్కువ ధరకు అమ్ముకునే వరకు మితిమీరిన తెలివితేటలు వాడేస్తుంటారట. అంతేనా మూడుసార్లు రాష్ట్ర మంత్రిగా కూడా వెలగబెట్టారట కన్నబాబు. మరి ఏం చేశారనేది ఇప్పటికీ తెలియరావట్లేదంటారు రాష్ట్ర ప్రజలు. అంటే రాష్ట్ర ప్రజలే కాదు కాకినాడ రూరల్ ప్రజానీకం కూడ అదే అంటున్నారు. నాలుగు ప్రారంభోత్సవాలు, నలభై ఫోటోలు దిగడమే తప్ప పనులు అడుగు కూడా పడవని దెప్పి పొడుస్తున్నారు. ఎందుకంటే కాసులు రాలని ఏ పని చేయరట కన్నాల బాబు, అదేనండి కన్నబాబు. అయినా ఎవరైనా ప్రజాప్రతినిధి అయ్యుండి సొంత ప్రజల ఆస్తులకు, సొమ్ములకే కన్నాలు వేస్తారా? మరీ దుర్మార్గం కాకపోతేనూ. అందుకే కాకినాడ కేడీల్లో దోపిడీదారులకే దోపిడీదారు అంటారు ఎమ్మెల్యే కన్నబాబును.