ఆయన పేరు వింటే అవినీతి ఆనందంతో గంతులేస్తుంది. అవినీతిపరుల గుండెల్లో సంతోషం పెల్లుబిక్కుతుంది. ఎక్కడ ఆస్కారం ఉంటే అక్కడ అవినీతి హద్దులు లేకుండా జరిగిపోతుంది. అందులో వాటాలు కూడా ఆయనకు సజావుగా అందుతాయి. ఒకవేళ అలా జరగలేదంటే ఇక ఎవరికో సమయం దగ్గరపడిందా అనేంత ఆందోళనలు మొదలవుతాయి. మరి ఆయనెవరో అనుకుంటున్నారా? ఇంకెవరు మన కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అని జనం కోడై కూస్తున్నారు. అవినీతికి కేరాఫ్ అడ్రస్. నడుస్తూ తిరుగుతున్న లంచాలాసురుడికి ప్రతిరూపమని అంటున్నారు. అందుకే కాకినాడ సిటీ నియోజకవర్గంలోని అవినీతిపరులకు ఆయన దైవంతో సమానం. నీతిపరులకు ఆయనంటే కోపం, ఎనలేని భయం. ఎందుకంటే ప్రశ్నిస్తే అణచివేస్తారు, అధికార బలంతో జీవితాలను నాశనం చేస్తారని ఆయన గురించి తెలిసిన వారు చెబుతున్నారు. అందుకే ద్వారంపూడి పేరు వింటే ఎంత పెద్ద అధికారికైనా హడలే. అక్కడ ఇక్కడా, అది ఇది అని ఏదీ లేదు ఎక్కడ అమ్యామ్యాలు అందుతాయనుకుంటే అక్కడికి చేరిపోతారు. తన వాటా అందే వరకు ఊరికే ఉండరు. కాదని ఎవరైనా తోక జాడిస్తే వారి తోకలు కత్తిరించి అంతా తన ఖాతాలోకి వేసేసుకుంటారనే అభిప్రాయాలు లేకపోలేదు. అందుకే నియోజకవర్గంలో ఏ అవినీతి జరగాలన్నా వాటాలు ఆయనకే ముందు అందాలని రూల్ ఉందట.
అయితే ఈ అవినీతి అసురుడికి ఓ ప్రత్యేకత ఉంది. అన్ని దందాల్లో లాభాలు చూసుకునే ఈ అసురుడు అత్యధికంగా సంపాదించేది బియ్యంపైనే అంటా. అది కేవలం జిల్లాలోనీ ఏ గల్లీకో, వీధికో పరిమితం కాలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బియ్యం మాఫియాకు కర్త, కర్మ, క్రియా ద్వారంపూడియేనని తెలిసిన వారు రెండో మాట లేకుండా చెబుతారంటే అర్థం చేసుకోండి. రాష్ట్రవ్యాప్తంగా బియ్యం సిండికేట్ ఏర్పాటు చేసి వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడనే ఆరోపణలున్నాయి. అందుకు తగినట్లుగానే ఆయన పరిచయాలు పెరిగాయి. ఎంతైనా చెట్టు ఒకటైతే, కాయ ఇంకోటవుతుందా. వైసీపీ అంటే అవినీతి పార్టీ. అందులో తమ అధినాయకుడిని ఆదర్శంగా తీసుకొని మిగిలిన వారికి ఆదర్శంగా నిలవాలనుకునే ద్వారంపూడి లాంటి వారు ఉంటారు. కాకపోతే అధినాయకుడికి ద్వారంపూడి లాగా అందరూ సన్నిహితులు కాలేరు. అధినాయకుడు లక్ష కోట్ల అవినీతి చేస్తే తాను కనీసం వేల కోట్లైనా చేయాలనే లక్ష్యం మరి. లారీ యూనియన్ల నుంచి వాటాలు మొదలుకొని అక్రమ మైనింగ్ లో వసూళ్ల వరకు చంద్రశేఖర్ రెడ్డి చెయ్యి తడవనిది ఏ పని కాదంటే నమ్మలేరేమో. అందుకే ఈ ద్వారంపూడి అవినీతి కేడీ అని కాకినాడ మొత్తం ముక్త కంఠంతో చెబుతుంది.