సానా సతీష్ బాబు.. ఈ పేరు ఎంతో మందికి ఓ భరోసా. ఎంతో మంది జీవితాలకు ఓ నమ్మకం. అభాగ్యులకు ఓ ఆశాకిరణం. అణగారిన వర్గాల వారికి ఓ బలం. ఎందుకంటే వారందరి మేలు కోరి పనిచేస్తున్న మహర్షి సానా సతీష్ బాబు. ఆర్తులకు ఆపన్న హస్తం అందిస్తూ వారికి అండగా నిలుస్తున్న గొప్ప మనసున్న మారాజు సానా సతీష్ బాబు. అందుకే పిలిచిన వెంటనే పలికే దైవంలా కొలుస్తారు సతీష్ బాబు ద్వారా సహాయం పొందిన ప్రతిఒక్కరూ. అయితే అది తన గొప్పతనంగా ఏ మాత్రం భావించరు సానా సతీష్ బాబు. ఆర్తులకు సహాయం చేయడం తనకు భగవంతుడు ప్రసాదించిన వరంగా భావిస్తారు. వారికి చేస్తున్నది సేవ అని తలుస్తారు. మానవత్వమే అత్యున్నతమైనదని నిస్కల్మషంగా చెబుతారు. శక్తి సామర్థ్యాలు బాధ్యతలను పెంచుతాయని, వాటిని సమాజహితానికి, ప్రజలకు మంచి చేసేందుకే సద్వినియోగపరచాలని స్పష్టం చేస్తారు. చెప్పడమే కాదు చేతల్లో చూపించి నలుగురికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు సానా సతీష్ బాబు. అందుకే ఆపదలో పిలిస్తే పలికేవారు మన సానా సతీష్ బాబు అంటారు ఆయన సన్నిహితులు. కష్టం ఎంతటిదైనా అభయ హస్తాన్ని అందిస్తారని ఆనందంగా తెలియజేస్తారు.
సానా సతీష్ బాబు ఫౌండేషన్ ను ఉన్నత ఆశయంతో సానా సతీష్ బాబు ప్రారంభించారు. కాకినాడవాసులకు సేవ చేసి వారి జీవితాల్లో మార్పును తీసుకురావాలని సేవా కార్యక్రమాలను ఫౌండేషన్ ద్వారా మొదలుపెట్టారు. ఫౌండేషన్ ను తన ప్రతిరూపంగా భావిస్తూ ప్రజాసేవను కొనసాగిస్తున్నారు. అందుకు తన కష్టార్జితాన్ని వెచ్చిస్తూ కాకినాడవాసుల సంక్షేమానికి పాటుపడుతున్నారు. సానా సతీష్ బాబు ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు అంటే స్వయంగా సానా సతీష్ బాబు ప్రజా సేవలో భాగమవ్వడం అని ఫౌండేషన్ ప్రతినిధులు చెబుతారు. ఎందుకంటే ఎవరైనా సహాయం కావాలంటే సహాయపడే వారి కోసం వెతుకుతూ వెళ్తారు. కానీ సానా సతీష్ బాబు ఫౌండేషన్ మాత్రం అందుకు భిన్నంగా సేవ చేస్తుంది. ప్రజలకు చేరువై వారి సమస్యలు తెలుసుకుంటుంది. ఫౌండేషన్ లక్ష్యాలకు, సానా సతీష్ బాబు ఆశయాలకు అనుగుణంగా సహాయసహకారాలు అందిస్తుంది. అందుకే విద్యా రంగంలో, ఉపాధి రంగంలో, మహిళా సాధికారతలో, చిరు వ్యాపారాల్లో, ప్రజా సంక్షేమంలో అవసరమైన వారికి ఆశాకిరణంగా నిలుస్తుంది. ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారని తెలిసిన వెంటనే ఆదుకుంటూ అండగా నిలుస్తోంది. ఒక్క పిలుపుతో సమస్యలకు పరిష్కారం చూపుతోంది. ఎందుకంటే సేవా పరమో ధర్మ: అనే భావనను తూచ తప్పకుండా పాటిస్తారు సానా సతీష్ బాబు. ఆయన ప్రతిరూపమే సానా సతీష్ బాబు ఫౌండేషన్. ఆయన ఆశయ సాధనే ఫౌండేషన్ లక్ష్యం.