కఠిన పరిస్థితులను అధిగమించి విద్యాభ్యాసం, దశాబ్ద కాలం పాటు ఉత్తమ ఉద్యోగిగా ప్రశంసలు, కార్పొరేట్ స్థాయి శక్తి, ఆనందకరమైన కుటుంబ జీవితం చాలా మంది ఇవి ఉంటే చాలు అనుకుంటారు. కానీ సానా సతీష్ బాబు ఫాండేషన్ వ్యవస్థాపకులు సానా సతీష్ బాబు గారికి ఇవేవి కూడా సంతృప్తిని ఇవ్వలేదు. తన జీవితం ఇంతే కాదు, ఇంకా ఏదో సాధించాలనే ఆలోచన ఆయనను వెంటాడుతూ ఉండేది. ఇక్కడితో తన గమ్యం పూర్తి కాలేదనే స్పష్టత ఆయనలో కనిపించేది. తప మనస్సాక్షి తనకేదో చెప్పాలనే ప్రయత్నం చేస్తోంది. అదేంటని తెలుసుకునేందుకు చేసిన ప్రయత్నంలో నిద్ర దరిచేరని రోజులు ఎన్నో గడిచాయి. ఒక రోజు అనుకోకుండా మానవ సేవనే మాధవ సేవ అనే ఆలోచన తన మనసు అంతరంలో నుంచి వచ్చింది. అప్పుడు సతీష్ బాబు గారికి లోలోపల ఏదో తెలియని ఆత్మ సంతృప్తి కలిగింది. అంతే తన అసలైన లక్ష్యం ఏమిటో తెలిసింది. తన పుట్టిన ఊరి కోసం ఏమైనా చేయాలి. అక్కడి ప్రజల జీవితాల్లో తన శక్తి మేరకు వెలుగులు నింపాలని మరింత స్పష్టత వచ్చింది.
అందుకే కార్పొరేట్ స్థాయికి ఎదిగినా పుట్టిన నేలను ఎన్నడూ మరువలేదు. ఎంత ఎదిగినా నేలను వీడలేదు. కాకినాడకు వచ్చి అన్నం పెట్టే రైతన్నలకు చేరువయ్యారు. వ్యవసాయ రంగంలోనూ పెట్టుబడులు పెట్టారు. అందులోనూ విజయాలను సాధించారు. రైతన్నల జీవితాల్లో మార్పులను తీసుకొచ్చారు. అలా కాకినాడ మన్నుకు మరింత దగ్గరయ్యారు. తరువాత యువత కోసం ఏమైనా చేయాలనుకున్నారు. వారిలోని ప్రతిభను వెలికి తీసేలా కార్యక్రమాలను నిర్వహించారు. ప్రతిభావంతులైన యువతను గుర్తించి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ప్రోత్సహించారు. వేలాది మందికి నైపుణ్య శిక్షణను అందించి వారికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలను కల్పించారు. కాకినాడ యూత్ పవర్ ను సరైన మార్గంలో వెళ్లేందుకు తోడ్పాటునిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు సానా సతీష్ బాబు గారు.
కాకినాడలో ఎవరైనా కష్టంలో ఉన్నారని తెలిస్తే చాలు వారికి అండగా నిలిచేందుకు తక్షణమే స్పందించేవారు. అదే సేవా తత్పరత ఆయనను ప్రజా సేవ వైపు వడివడిగా అడుగులు వేసేలా చేశారు. సానా సతీష్ బాబు ఫౌండేషన్