కాకినాడ జిల్లా వర్తమాన ధ్రువతార, వ్యాపార దిగ్గజం, మానవతావాది, సామాజికవేత్త అయిన సానా సతీష్ బాబుకు జన్మనిచ్చి నేల. విద్యా నిలయం, సరస్వతి పుత్రుల ధామం మన కాకినాడ. దేశంలోనే అతిపెద్ద నగరాల్లో ఆరో స్థానంలో ఉంది. అటు ఆర్థిక అభివృద్ధి, ఇటు సామాజిక ఉన్నతి సాధించే దిశగా ప్రయాణం సాగిస్తోంది. ఉజ్వలమైన భవిష్యత్తు వైపు వెయ్యి కళ్లతో చూస్తోంది. లక్ష్య సాధన వైపు బలాన్ని కూడ దీస్తోంది. అటువంటి తరుణంలో సానా సతీష్ బాబు కాకినాడ కోసం ఒక ఆశా కిరణంలా తిరిగి వచ్చారు. తనకు జన్మనిచ్చిన నేల రుణం తీర్చుకోవాలని సంకల్పించారు. అంతర్జాతీయ స్థాయిలో కాకినాడను తీర్చిదిద్దాలని నిర్ణయించుకున్నారు. అవన్నీ సాధించాలంటే ముందు ప్రజలు సశక్తులు కావాలి. వారి జీవన స్థితిగతులు మారాలి. ఆర్థికంగా, సామాజికంగా బలంగా నిలదొక్కుకోవాలి. వారి వ్యక్తిగత, సామాజిక సమస్యలకు పరిష్కారం లభించాలి. ఎందుకంటే ప్రజల సామాజిక, ఆర్థిక పరిస్థితులు బలోపేతం అయితే కాకినాడ కూడా బలోపేతమవుతుందని సానా సతీష్ బాబు విశ్వసిస్తారు. అందుకే ఆయన ఆశయానికి అనుగుణంగా సానా సతీష్ బాబు ఫౌండేషన్ కార్యకలాపాలను నిర్వహిస్తుంది. ప్రజల జీవితాలను బాగు చేసేందుకు కృషి చేస్తోంది.
సానా సతీష్ బాబు ఫౌండేషన్ ప్రధానంగా విద్యా రంగం, ప్రజారోగ్యం, మహిళా సాధికారత, యువ వికాసం, పెద్దల సంక్షేమం, వీధి వ్యాపారులకు సహాయం వంటి అంశాలపై దృష్టి పెట్టింది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ప్రతిభావవంతులైన విద్యార్థులుంటారు. వారికి సరైన ప్రోత్సాహం లభించక, కుటుంబ ఆర్థిక స్థితి గతులు సహకరించక విద్యలో రాణించలేకపోతారు. అలాంటి విద్యార్థులను గుర్తించి వారికి ఆర్థిక సహాయంతో పాటు అవసరమైన స్టేషనరీని సానా సతీష్ బాబు ఫౌండేషన్ అందిస్తోంది. అంతేకాకుండా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థులు పాఠశాల నుంచి ఇంటికి, ఇంటి నుంచి పాఠశాలకు రాకపోకలు సాగించేందుకు ప్రతి ఏడాది ఉచితంగా బస్సు పాసులను పంపిణీ చేస్తోంది. పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగుపరచి అరొకర సౌకర్యాల సమస్యను తీరుస్తోంది. ఇలా కాకినాడ విద్యా రంగ సేవలో ముందుంది. పేద, మధ్య తరగతి వారు చాలా మంది ఖరీదు ఎక్కువగా ఉండడం వల్ల సరైన వైద్యాన్ని పొందలేరు. నాణ్యమైన వైద్యం అందక అనారోగ్యం రోజురోజుకు పెరిగి బాధపడుతుంటారు. అలాంటి పేద, మధ్య తరగతి వారికి సానా సతీష్ బాబు ఫౌండేషన్ అండగా నిలుస్తోంది. వారికి వైద్యానికి అవసరమయ్యే మందులను అందిస్తోంది. వారు కోలుకునేందుకు తోడ్పాటునిస్తోంది. ఉచిత ఆరోగ్య శిబిరాల ద్వారా ప్రజారోగ్యానికి భరోసాను కల్పిస్తోంది. మహిళలు అబలలు కాదు సబలలు అని సానా సతీష్ బాబు ఫౌండేషన్ బలంగా విశ్వసిస్తుంది. అందుకే వారి సాధికారతకు ప్రాధాన్యం ఇస్తుంది. మన ఊరు మహిళలు కార్యక్రమ నిర్వహణ ద్వారా వారిలోని ప్రతిభను వెలికి తెస్తోంది. వారు తమ సొంత కాళ్లపై నిలబడేలా ప్రోత్సాహాన్ని ఇస్తోంది. యువతకు విద్యా రంగంలో అండగా ఉండడమే కాదు క్రీడా రంగంలో కూడా ప్రోత్సాహాన్ని అందిస్తోంది సానా సతీష్ బాబు ఫౌండేషన్. సానా సతీష్ బాబు క్రికెట్ ఛాంపియన్ షిప్ ద్వారా భావి క్రీడాకారులను వెలుగులోకి తీసుకొస్తుంది. వివిధ వేదికల్లో భాగస్వామ్యం కల్పిస్తూ జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు తోడ్పాటునిస్తోంది. యువతలోని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పెట్టుబడి సాయాన్ని చేయడమే కాకుండా వారు ఎదగడానికి మార్గదర్శనం చేయడంలో ముఖ్య భూమికను పోషిస్తోంది. కన్నబిడ్డల నిర్లక్ష్యానికి గురై ఇబ్బంది పడుతున్న పెద్దలకు బాసటగా నిలుస్తోంది సానా సతీష్ బాబు ఫౌండేషన్. కాకినాడలోని వృద్ధాశ్రమాల్లో ఉంటున్న పెద్దలకు వసతులను కల్పించడమే కాదు వారి మానసికోల్లాసానికి దోహదపడుతోంది. వీధి వ్యాపారులకు కావాల్సిన మౌలిక వసతులను కల్పించడమే కాదు, వారికి అవసరంలో సాయం కూడా చేస్తూ ఆదర్శవంతమైన సేవా కార్యక్రమాలను చేపడుతోంది సానా సతీష్ బాబు ఫౌండేషన్. ఎందుకంటే కాకినాడ ప్రజల సంక్షేమమే, నిజమైన కాకినాడ అభివృద్ధి. దానిని సాకారం చేయడమే సానా సతీష్ బాబు ఫౌండేషన్ స్ఫూర్తి.