ఓ వైపు ఓడరేవు, ఓడరేవు తీరానికి పారిశ్రామికవాడ మన కాకినాడ ప్రత్యేకత. కానీ ప్రగతి విషయంలో ఒక అడుగు ముందుకు, పది అడుగులు వెనక్కి అన్నట్లుగా ఉంటుంది ఉంటుంది. అభివృద్ధికి ఎప్పుడూ ఆమడ దూరమే. అవసరమైన సహజ వనరులు, మానవ వనరులు ఉన్నా కూడా వాడి సద్వినియోగం జరగడం లేదు. అందుకే చాలా మంది జిల్లావాసులు జిల్లాతో పాటు రాష్ట్రం దాటి మరీ ఉపాధి కోసం పరుగులు తీస్తున్నారు. స్థానికంగా ఉన్న పరిశ్రమలు నిరుద్యోగాన్ని భర్తీ చేయలేకపోతున్నాయి. యువతకు, నిరుద్యోగులకు సరైన అవకాశాలను కల్పించడంలో వెనకబడుతున్నాయి. ఘనమైన చరిత్ర కలిగిన కాకినాడ కరువు కాటకాలు, నిరుద్యోగం, ప్రతిభావావంతులకు సరైన ప్రోత్సాహం దక్కని కారణంగా వెనుకబడి పోతోంది. అటువంటి తరుణంలో కాకినాడ భవిష్యత్తును మార్చడానికి ఆ వెలుగు చీకట్లను చీలుస్తూ వచ్చింది. కాకినాడ అభివృద్ధికి తానున్నానే భరోసాను కల్పించింది. ఆ వెలుగే సానా సతీష్ బాబు. అచెంచలమైన ఆత్మ విశ్వాసం, నిరాడంబరత్వానికి కేరాఫ్ అడ్రస్, అడుగుపెట్టిన రంగంలో విజయాలను కైవసం చేసుకునే సత్తా సానా సతీష్ బాబు సొంతం.
అపారమైన వనరులున్న కాకినాడ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారడం సానా సతీష్ బాబు మనసు కలచివేసింది. తాను పుట్టి పెరిగిన నేల అగాథంలోకి వెళ్తుండడం చూసి చలించిపోయింది. అందుకే తన జన్మభూమి అయిన కాకినాడ కోసం కదం తొక్కారు. కాకినాడను అభివృద్ధి పథంలో నడిపించాలని నిశ్చయించుకుని ముందుకు సాగుతున్నారు. ప్రజల కష్టాలను తన కష్టాలుగా, ప్రజల బాధలను తన బాధలుగా భావిస్తూ వాటిని తీర్చేందుకు కంకణం కట్టుకున్నారు. కాకినాడ ప్రజలను తన కుటుంబ సభ్యులుగా భావిస్తూ వారి అభ్యున్నతి కోసం అహర్నిశలు పాటుపడుతున్నారు. ఏ ఒక్క వ్యక్తి కూడా పేదరికం, సామాజిక పరిస్థితుల కారణంగా వెనుకబడినా అది కాకినాడ వెనుకబాటుగానే లెక్క కడతారని సానా సతీష్ బాబు ఖరాఖండిగా చెబుతారు. కాకినాడ వెనుకబాటు అంటే తనకు జన్మనిచ్చిన నేల వెనుకబడి పోవడమేనని భావోద్వేగానికి గురవుతారు. అటువంటి పరిస్థితులు ఎన్నటికీ తన జన్మభూమికి రానివ్వనని సానా సతీష్ బాబు ఫౌండేషన్ ద్వారా వివిధ సామాజిక సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి వాటిని విజయవంతంగా అమలు చేస్తున్నారు.
ముఖ్యంగా యువతను క్రీడలతో పాటు విద్య, స్వయం ఉపాధి రంగాల్లో ప్రోత్సహిస్తున్నారు. ఎందుకంటే నేటి యువతే రేపటి కాకినాడ భవిత. వారు జీవితంలో ఉన్నతంగా ఎదిగితే కాకినాడ సేవలో తనలాగా భాగస్వాములు అవ్వగలుగుతారని సానా సతీష్ బాబు అభిలాష. అందుకు ప్రతిభావావంతులైన విద్యార్థులకు ఆర్థిక సహాయం చేస్తున్నారు. వ్యాపారం చేయాలనుకునే యువతకు ఆర్థికంగా చేయూతనిస్తూ మార్గదర్శనం చేస్తున్నారు. వారు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు అండగా నిలుస్తున్నారు. ఉపాధి కోసం చూసే యువతకు నైపుణ్య శిక్షణ కోసం బాటలు వేస్తున్నారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమల వారికి చేదోడు వాదోడుగా ఉంటూ పరిశ్రమల అభివృద్ధికి స్నేహపూర్వక సహకారం అందిస్తున్నారు. అంతేకాదు స్థానిక సమస్యల పరిష్కారంలోనూ ముందుండి ఆదర్శంగా నిలుస్తున్నారు. నేటి మన కాకినాడను రేపు అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలనే ఆకాంక్షతో పనిచేస్తున్నారు. కాకినాడ అభివృద్ధికి బాటలు వేస్తూ అందులో జిల్లా ప్రజలందరినీ భాగస్వాములను చేస్తున్నారు. కాకినాడ ఉజ్వల భవిష్యత్తు కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు.