• Home
  • Telangana
  • Political Analysis
  • Surveys & Exit Polls
  • Hyderabad Politics
  • Graduate MLC
  • About
  • Contact
Facebook Twitter YouTube WhatsApp
Polytricks.in
  • About
  • Editorial Policy
  • Our Authors
  • Contact
Facebook Twitter YouTube WhatsApp
YouTube
  • Home
  • Telangana
  • Political Analysis
  • Surveys & Exit Polls
  • Hyderabad Politics
  • Graduate MLC
  • About
  • Contact
Polytricks.in
Home » తమ్ముడి బాటలోనే అన్న… కమలం గూటికి చేరే టైం వచ్చేసినట్టేనా..?
National

తమ్ముడి బాటలోనే అన్న… కమలం గూటికి చేరే టైం వచ్చేసినట్టేనా..?

Prashanth PagillaBy Prashanth PagillaFebruary 14, 2023No Comments3 Mins Read
Facebook Twitter WhatsApp Pinterest LinkedIn Tumblr Reddit Email VKontakte
Share
Facebook Twitter WhatsApp LinkedIn Email

అదానీ వ్యవహారంలో దేశ స్థాయిలో కాంగ్రెస్ ఇమేజ్ అమాంతం పెరిగింది. పార్లమెంట్ లో కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ దెబ్బకు ప్రధాన మంత్రి మోడీ నీళ్లు తాగారు. తొమ్మిదేళ్లు అప్రతిహతంగా… తనకు ఎదురే లేదన్నట్టుగా వ్యవహరిస్తున్న మోడీకి అదానీ వ్యవహారం గుదిబండగా మారింది. ఇప్పటికే భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్ కు అట్రాక్షన్ తెచ్చిన రాహుల్ గాంధీ తాజాగా పార్లమెంట్ లో అదానీ కుంభకోణంపై చెలరేగిన తీరు కాంగ్రెస్ ఇమేజ్ ను, రాహుల్ గాంధీ ఇమేజ్ ను ఆకాశంలో నిలబెట్టింది…

సీన్ కట్ చేస్తే కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తాజా వ్యాఖ్యలు బీజేపీలో కొత్త ఉత్సాహాన్ని రేకెత్తిస్తున్నాయి. దక్షిణాదిలో… అదీ అర్బన్ ప్రాంతాల్లో అంతో ఇంతో పుంజుకున్నామన్న భావనలో ఉన్న బీజేపీకి అదానీ దెబ్బ మామూలుగా తగలలేదు. దక్షిణాదిలో ముఖ్యంగా కర్నాటక, తెలంగాణలో మాత్రమే బీజేపీ ఉనికి ఉంది. ఆ ఉనికి సైతం దెబ్బతింటున్న సమయంలో కోమటిరెడ్డి వ్యాఖ్యలు బీజేపీకి జీవం పోసేలా కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పైకి చూడడానికి అవి తెలంగాణ రాజకీయాలకే పరిమితమైన వ్యాఖ్యలుగా కనిపిస్తున్నప్పటికీ బీజేపీ స్కెచ్ లో భాగమే ఈ వ్యాఖ్యలు అని పొలిటికల్ సర్కిళ్లలో వినిపిస్తోంది. ముఖ్యంగా ఈ సారి తెలంగాణపై బీజేపీ పెద్ద ఆశలే పెట్టుకుంది. దేశంలో ఓవరాల్ గా అదానీ దెబ్బకు కాంగ్రెస్ ఇమేజ్ పెరుగుతుండటంతో ఆ ప్రభావం తెలంగాణపై కూడా గట్టిగానే కనిపిస్తోంది. నిన్నటి వరకు కాంగ్రెస్ అవకాశాలపై అనుమానంగా ఉన్న సామాన్య జనంలో సైతం ఇప్పుడు టాక్ మారింది. కాంగ్రెస్ కు ఛాన్స్ కనిపిస్తోందన్న టాక్ వినిపిస్తోంది. సరిగ్గా ఈ సమయంలోనే హంగ్ అంటూ కోమటి రెడ్డి మాట్లాడటం ఎవరికి లాభం అన్న ప్రశ్న వినిపిస్తోంది. కాంగ్రెస్ కు మెజారిటీ వచ్చే పరిస్థితి లేదు అని సొంత పార్టీ ఎంపీనే… బహిరంగంగా మాట్లాడటం ఎవరి స్కెచ్ లో భాగం అన్నది ప్రశ్న. బీఆర్ఎస్ తో కలిసే సమస్యే లేదు అని రాహుల్ గాంధీ పదే పదే చెబుతున్నారు. తెలంగాణలో భారత్ జోడో యాత్ర సందర్భంలోనే కాదు… అంతకు ముందు మే 6, 2022 లో వరంగల్ లో జరిగిన రైతు గర్జన సభలో సైతం ఈ విషయం రాహుల్ గాంధీ స్పష్టంగా చెప్పారు. బీఆర్ఎస్ తో, కేసీఆర్ తో స్నేహం కోరుకునే వారెవరైనా సరే పార్టీ నుండి వెళ్లిపోవచ్చు… లేదా మేమే గెంటేస్తాం అని కూడా రాహుల్ కుండబద్ధలు కొట్టి చెప్పారు.
పార్టీ అగ్రనేత నుండి ఇంత స్పష్టమైన ప్రకటన ఉన్న తర్వాత కూడా ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ తో కలుస్తాం అంటూ కోమటిరెడ్డి ప్రకటించడం దేనికి సంకేతం అన్న డౌట్ వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ – బీఆర్ఎస్ కలుస్తాయి అన్న సంకేతాలు ఇవ్వడం ద్వారా ఏకైక అల్టర్నేటివ్ బీజేపీనే అని కోమటిరెడ్డి చెప్పకనే చెప్పే ప్రయత్నం చేశారు. ఇది కూర్చొన్న కొమ్మను నరుక్కోవడం లాంటిదే కదా అన్నది పొలిటికల్ ఎనలిస్టుల వాదన. బీఆర్ఎస్ తో… కేసీఆర్ తో కలిసే సమస్యే లేదని రాహుల్ గాంధీనే చెప్పిన తర్వాత కలుస్తాం అని ఏ హోదాలో కోమటిరెడ్డి చెబుతున్నారన్నది మరో ప్రశ్న.

టోటల్ ఎపిసోడ్ గమనిస్తే… కోమటిరెడ్డి వ్యాఖ్యల వెనుక బీజేపీ హస్తం ఉందన్న ప్రచారం జరుగుతోంది. బీజేపీ హైకమాండ్ డైరెక్షన్ లోనే కోమటిరెడ్డి ఈ ప్రకటన చేశారన్న ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ – బీఆర్ఎస్ ఒక్కటే అన్న ముద్ర వేయాలన్న బీజేపీ వ్యూహాన్ని కాంగ్రెస్ ఎంపీ చేతనే అమలు చేయించారన్న భావన వ్యక్తమవుతోంది. కోమటిరెడ్డి గల్లీ స్థాయి లీడర్ కాదు… ఆయన ఎంపీ. అంటే జాతీయ స్థాయి నాయకుడు. ఆయన మాట్లాడే మాట జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పై ప్రభావం చూపుతుంది. ఈ విషయం తెలియకనే కోమటిరెడ్డి కామెంట్ చేశారని చెప్పలేము. మునుగోడు ఎన్నికల సమయంలోనే కోమటిరెడ్డి కూడా సోదరుడుతో పాటు బీజేపీలో చేరతారని ప్రచారం జరిగింది. బీజేపీని గెలిపించమని కోమటిరెడ్డి కూడా ఫోన్ ద్వారా కేడర్ కు ప్రచారం చేశారు. ఆ తర్వాత బీజేపీ లో చేరే అంశం మరుగునపడింది. తాజాగా ఆ టైం వచ్చేసిందా అన్న డౌట్ రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. కోమటిరెడ్డి ఇక బీజేపీ గూటికి వెళ్లేందుకు ముహూర్తం ఖరారైయ్యే ఇట్లాంటి కామెంట్స్ చేస్తున్నారా అన్నది ప్రశ్న. మరి ఇప్పుడు కాంగ్రెస్ హై కమాండ్ ఏం చేస్తుంది. రాహుల్ ప్రకటనకే కౌంటర్ ఇచ్చిన కోమటిరెడ్డి విషయంలో కాంగ్రెస్ నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి. వెయిట్ అండ్ సీ…

Share. Facebook Twitter Pinterest Tumblr Email WhatsApp
Prashanth Pagilla

Related Posts

388 ఎకరాల వివాదం: ఫామ్‌హౌస్ రాజకీయాల మధ్య చిక్కుకున్న పేద రైతు

September 22, 2026

సెప్టెంబర్ 28–30 బ్యాంకు సమ్మె: ఐదు రోజులు బ్రాంచ్ సేవలు ఆగుతాయా? UPI, ATM, చెక్కులపై అసలు ప్రభావం

September 22, 2026

ఎర్రవల్లి నుంచి కొటూర్ వరకూ భూముల యుద్ధం: అసెంబ్లీలో ఆరోపణలు, విచారణ సవాళ్లు

September 22, 2026

Comments are closed.

Don't Miss
Editors Choice

388 ఎకరాల వివాదం: ఫామ్‌హౌస్ రాజకీయాల మధ్య చిక్కుకున్న పేద రైతు

September 22, 20260

సీఎం రేవంత్ రెడ్డి 388 ఎకరాలు పంచుతామన్నారు. గ్రౌండ్‌లో పాత అసైనీలు ధరణి పాస్‌బుక్ కోసం నిలబడ్డారు. పాలిట్రిక్స్ విశ్లేషణ: రాజకీయాలకు అతీతంగా నిజమైన పేద రైతులకు న్యాయం జరగాలి.

సెప్టెంబర్ 28–30 బ్యాంకు సమ్మె: ఐదు రోజులు బ్రాంచ్ సేవలు ఆగుతాయా? UPI, ATM, చెక్కులపై అసలు ప్రభావం

September 22, 2026

ఎర్రవల్లి నుంచి కొటూర్ వరకూ భూముల యుద్ధం: అసెంబ్లీలో ఆరోపణలు, విచారణ సవాళ్లు

September 22, 2026

రైతులకు చేరని ₹813 కోట్లు: భూసేకరణ పరిహారం అధికారుల ఖాతాల్లో ఎందుకు నిలిచింది?

September 22, 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • YouTube
  • WhatsApp
Our Picks

388 ఎకరాల వివాదం: ఫామ్‌హౌస్ రాజకీయాల మధ్య చిక్కుకున్న పేద రైతు

September 22, 2026

సెప్టెంబర్ 28–30 బ్యాంకు సమ్మె: ఐదు రోజులు బ్రాంచ్ సేవలు ఆగుతాయా? UPI, ATM, చెక్కులపై అసలు ప్రభావం

September 22, 2026

ఎర్రవల్లి నుంచి కొటూర్ వరకూ భూముల యుద్ధం: అసెంబ్లీలో ఆరోపణలు, విచారణ సవాళ్లు

September 22, 2026

రైతులకు చేరని ₹813 కోట్లు: భూసేకరణ పరిహారం అధికారుల ఖాతాల్లో ఎందుకు నిలిచింది?

September 22, 2026
Facebook Twitter YouTube WhatsApp
  • Home
  • Andhra Pradesh
  • Telangana
  • About
  • Our Authors
  • Editorial Policy
  • Corrections
  • Privacy Policy
  • Contact
© 2026 Polytricks.in. All rights reserved.

Type above and press Enter to search. Press Esc to cancel.

Go to mobile version