ప్రస్తుత ఎమ్మెల్సీ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత వచ్చే ఎన్నికల్లో ఎక్కడ నుండి పోటి చేస్తారన్నది పార్టీలో చర్చనీయంశంగా మారింది.ఎమ్మెల్యేగానా..? ఎంపీగానా..? అనే చర్చ బీఆర్ఎస్ లో హాట్ టాపిక్ గా మారింది.2014 లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీ స్థానం నుండి పోటి చేసి విజయం సాధించి మొదటి సారిగా పార్లమెంట్ లో అడుగుపెట్టారు.ఆ తర్వాత 2019 లో జరిగిన ఎన్నికల నుండి మళ్ళీ ఎంపీగా పోటీచేసి ఓడిపోయి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.
కేసీఆర్ టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మరినా తర్వాత కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు పూర్తిగా జాతీయ రాజకీయాల మీద దృష్టి పెట్టారు.కేసీఆర్ కవితను తెలంగాణ నుండే ఎన్నికల బరిలోకి దింపుతాడా లేక తనతో పాటు దేశ రాజకియలోకి తిసుకేల్తాడా అనేది రాష్ట్ర రాజకీయలో చర్చనీయంశంగా మారింది.అయితే కొందరి సినీయర్ నాయకుల నుంచి అందుతున్న సమాచారం మేరకు కవితకు నిజామాబాద్ ఎంపీ టికెట్ ఖాయమని తెలుస్తోంది.
గత ఎన్నికల్లో పోటిగా బరిలోకి దిగిన ధర్మపురి అర్వింది కవితపై గెలుపొందారు. అయితే ఎన్నికల ముందు ధర్మపురి అర్వింద్ నిజామాబాద్ కు పసుపు బోర్డ్ తెస్తానని రైతులకు హామీ ఇచ్చాడు.ఇచ్చినా హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారు.కాబట్టి అర్వింద్ పై నిజామాబాద్ లో ప్రజా వ్యతిరేకత వస్తుంది.వచ్చే ఎన్నికల్లో ఆయనకు ప్రత్యామ్నాయ వ్యక్తిని ఎన్నుకోవాలని చూస్తున్నారు.ఇదిలా ఉండగా గులాబీ పార్టీ ఇప్పుడు జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్ గా మరీనా తర్వాత వివిధ రాష్ట్రాల నుంచి కొందరు నాయకులు బీఆర్ఎస్ లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ బలపడే అవకాశం ఉందని అంటున్నారు.
అర్వింద్ కు పోటిగా కవిత ను ఫోకస్ చేసి టికెట్ ఇవ్వాలని అనుకుంటున్నారు.వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కీలక సీట్లు సాధించి ప్రభుత్వంలో చేరితే కొన్ని డిమాండ్లను నెరవేర్చుకోవచ్చని ప్రజలకు హామీలు ఇవ్వనున్నారు. ఒకవేళ ఎన్డీయే ప్రభుత్వం మారితే బీఆర్ఎస్ కు మరింత బలం చేకూరుతుంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ కు ఆ నిజామాబాద్ ఎంపీ సీటు కవితకు దక్కే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్పుకోచ్చాయి. ఈ అవకాశం ఇవ్వడం ద్వారా ఆమెను పార్లమెంట్ కు పంపియ్యోచ్చు. వీలైతే కేంద్ర మంత్రిని కూడ చేసే అవకాశం ఉంటుంది.