ఈ రోజులో పెళ్లి అయ్యి సంవత్సరాలు గడిచినా దంపతులకు సంతానం లేక చాలా మంది మనస్థాపానికి గురవుతున్నారు.ఎందుకంటే వాళ్ళు తిసుక్కునే ఆహరం వల్ల కాని ఆరోగ్య సమస్యలతో సంతానం కావడం చాలా కష్టతరంగా మారింది.ఇలా సంతానం కాని దంపతలు దత్తత తీసుకొని తల్లితండ్రులుగా మారుతున్నారు.ఇంతకు ముందు సంతానం లేని వాళ్ళు కేవలం అబ్బాయిలనే దత్తత తీసుకునేవారు.కాని కొంత కాలం నుండి అమ్మాయిలను దత్తత తీసుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.దత్తతకు పాపే కావాలని కోరుకునే దంపతులు ఎక్కువవుతున్నారని తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు వెల్లడించారు. ఇది ఇప్పుడు ఒక ట్రెండ్ మారింది అంటున్నారు.
ఇలా రోజు రోజుకు సంతానం లేని కారణంగా దరఖాస్తులు అధికంగా వస్తున్నాయని శిశు సంక్షేమ శాఖ అధికారులు తెలిపారు.ఒకవేళ దత్తతగా పిల్లల్ని తీసుకోవాలి అనుకునేవారు మహిళా శిశు సంక్షేమ శాఖకు దరఖాస్తు చేసుకోవాలి.వచ్చిన దరఖాస్తులను ఉన్నత అధికారులు పరిశీలించి,విచారణ జరిపి లీగల్ గా దత్తతకు ఇవ్వడం జరుగుతుంది.
రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం.. 2014 నుంచి 2022 వరకు అంటే ఎనిమిదేళ్లలో 1,430 మంది పిల్లలు దత్తతకు వెళ్లారు. ఇందులో 1,069 ఆడ పిల్లలు కాగా, అబ్బాయిల సంఖ్య 361 మాత్రమే. అంటే రోజు రోజుకు సంతానం లేని వాళ్ళు ఎక్కువగా ఆడపిల్లలను తీసుకొని తల్లితండ్రులుగా మారిపోతున్నారు .ఆడపిల్లలను దత్తత తీసుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉండడానికి మరో కారణం.
మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రకారం ఆడపిల్లను దత్తత తీసుకోవాలని దరఖాస్తులో కోరితే సంవంత్సరంలోపే దత్తత పాపను తీసుకెళ్లొచ్చని చెప్పారు.అదే అబ్బాయి అయితే దరఖాస్తు చేసుకున్న మూడు నుంచి నాలుగేళ్ళ ప్రాసెస్ ఉంటుందన్నారు.సర్వే ప్రకారం ఎక్కువగా హైదరాబాద్ లోనే దత్తత తీసుకునే దంపతులున్నరని వెల్లడించారు.