ఇదెక్కడి ఘోరం అండి…!పెళ్లి అయ్యి వారం రోజులు కూడా కాలే ఆ నూతన దంపతులు చనిపోయారు.ఇదెల జరిగింది అంటారా…? పెళ్లయ్యాక శోభనం గదిలోకి వెళ్లిన ఆ నూతన దంపతులు తెల్లరిన ఇంకా బయటికి రాకపోవడం తో ఆ ఇంటి బంధువులకు అనుమానం వచ్చి తలుపులను పగ్గులగోట్టి చూడగా ఆ నవ దంపతులు అప్పటికే కన్నుమూశారు.ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రతాప్ యాదవ్‌కు(22) పుష్ఫ(20)తో మే 30న పెళ్లి జరిగింది. వివాహం అనంతరం వారు శోభనం గదిలోకి వెళ్లారు. కానీ, తెల్లారేసరికల్లా వారు శవాలుగా మారారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు.ఈ నవ దంపతులు ఎలా చిపోయారు అని ఆ శవాలను పోస్ట్‌మార్టం చేయగా,దంపతులకు గుండెపోటు రావడంతో మరణించినట్టు పోస్ట్‌మార్టం నివేదికలో తేలిందని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.
ఆ నవ దంపతులను పంపిన గదిలో ఎలాంటి వెంటిలేషన్ , సీలింగ్ ఫ్యాన్ కూడా లేదని,దీంతో వారికి ఊపిరి ఆడకపోయివుండచ్చని కూడా చెప్పారు.పెండ్లి అయిన వారం రోజులో ఒకే ఇంట్లో ఇద్దరు చనిపోవడంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అయ్యారు.దంపతులిద్దరినీ ఒకే చితిపై వుంచి దహన సంస్కారాలు నిర్వహించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ సంఘటకు నెటిజన్లలు కంటతడి పెట్టిస్తోంది.