సమాజానికి రోల్ మోడల్ గా ఉండవలసిన ఓ ఉపాధ్యాయుడు ఒంటరి మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంటి యజమాని అయిన ఉపాధ్యాయుడు జవాన్ భార్యపై ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
రోజు రోజుకు ఒంటరి మహిళలపై అత్యాచారాలు,ఆఘాయిత్యాలు ఎక్కువైతున్నాయి. ఒంటిరిగా కనిపిస్తే చాలు మృగాలాల వెంటాడుతున్నారు. ఓ జవాను తన కుటుంబ సభ్యులతో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో రుద్రపూర్ గ్రామములో ఓ ఉపాధ్యాయుని ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. కొన్ని నెలలుగా ఆ ఇంట్లోనే అద్దెకు ఉంటున్నారు. ఈ క్రమంలోనే తన ఇంటికి వచ్చిన బంధువులతో సరదాగా గడుపుతూ ఈ నెల 15వ తేదిన నిందితుని కుటుంబ సభ్యులంతా బంధువుల ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో ఆ జవాను కూడా తన విధులకు వెళ్ళాడు. దీంతో ఒంటరిగా ఉన్న జవాను భార్య పై ఆ ఇంటి యజమాని లైంగిక దాడికి పాల్పడ్డాడు.
ఇంట్లో జవాను భార్య ఒంటరిగా ఉండడం చూసి ఆ యజమాని ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు.ఆ సమయంలో ఆమె తన బంధువులతో వీడియో కాల్ లో మాట్లాడుతోంది. దీనిని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసారు. వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ఆమెను రక్షించారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ఉత్తరాఖండ్ లో చోటుచేసుకుంది.