పెళ్లి చేసుకున్న తర్వాత మరి కొద్ది రోజులోనే విడాకులు తీసుకుంటున్నారు.ఇలా రోజు రోజు కు విడాకులు తీసుకునే దంపతులు పెరిగిపోతున్నారు.దీనికి కారణాలు వరకట్నాలు కాని, దాంపత్యాలు మధ్య అర్థం చేసుకున్నే మనస్సు లేకపోవడం మరి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కారణాలతో విడాకులు తీసుకుంటున్నారు.ఏ చిన్న చిన్న విషయాలకైనా తుది నిర్ణయం ఒకటే అదే విడాకులు.
ఈ రోజులో విడాకులు అన్న మాట ఒక ట్రెండ్ గా మారింది.ఇలా యువకుల మధ్య పెరుగుతున్న విడాకుల నిర్ణయాల పై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.దంపతుల మధ్య ప్రేమ,అప్యాత,అనురాగాలతో మాత్రమే కలిసి మెలిసి ఉండాలని సూచించింది.ఏ ఒక్కరికి ఇష్టం లేకున్నా విడాకులు తిసుకోవచ్చాన్ని సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది.విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నా దంపతులను అడ్డుకోల్సిన అవసరం ఎవరికీ లేదని,ఇష్టం లేని యడల దరఖాస్తు చేసుకోవచ్చు అని సూచించింది.
ఈ సందర్భంగా పరస్పరం ఇష్టపూర్వకంగా విడాకులు తీసుకునే వారి విషయంలో సుప్రీంకోర్టు రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 పరిధిలోని స్పెషల్ అధికారాలను వినియోగించుకునే వీలుందా? అన్న అంశంపై సుప్రీంలో విచారణ సాగింది.ఇప్పటివరకు విడాకులకు దరఖాస్తు చేసుకున్న తర్వాత ఆర్నెల్ల పాటు గడువు ఉండేది ఎందుకంటే విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నా దంపతులు మనస్సులు మరి ఒకటైయే అవకాశం ఉండొచ్చని భావించేది.కాని ఇప్పుడు ఆ నిబంధనను తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం లేదన్న విషయాన్నిసుప్రీం కోర్టు చెప్పేసింది.
విడాకులు కావాలని కోరుకున్న జంట.. అందుకు ఆరు నెలలు వేచి చూడాలన్నది తప్పనిసరి కాదన్న విషయం తాజా తీర్పుతో స్పష్టత ఇచ్చేసింది.ఇప్పుడు ఏలాంటి గడువు లేకుండా ఇష్టం లేని దంపతులకు విడాకులకు ఇవ్వడంలో ఎలాంటి సందేశం లేదని స్పష్టత ఇచ్చేసింది సుప్రీం కోర్టు.