బాలీవుడ్ నటుడు సోనుసూద్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు.ఎందుకంటే తాను ఎన్నో సేవ కార్యక్రమాలు నిర్వహించి ఎన్నో సేవలు చేసారు.కరోనా టైములో ప్రతి ఒక్కరు ఇండ్లకే పరిమితం అయితే సోను సూద్ మాత్రం తాను ఆపద్భాందవుడిగా బయటికి వచ్చి ఎంతో మందికి ఎన్నో సేవలు చేశాడు.ఈ నేపథ్యంలో తాజాగా సోనూసూద్ మరో మంచి పనికి శ్రీకారం చుట్టారు.పేద..అనాధ విద్యార్దుల కోసం బిహార్ లో ఆయన స్వయంగా ఓ ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మించబోతున్నారు.
అయితే ఈ స్కూల్ ని బీహార్ కి చెందిన 27 ఏళ్ల ఇంజనీర్ బీరేంద్రకుమార్ మహా తొలుత ప్రారంభించారు. బీరేంద్రకుమార్ చేస్తున్న ఉద్యోగాలన్ని వదిలేసి తాను స్వయంగా ఈ స్కూల్ నిర్మాణం చేపట్టారు. సోనుసూద్ పై అభిమానంతో ఈ పాఠశాలకు అతని పేరు పెట్టి 110 మంది విద్యార్దులు చదువుకునే విధంగా ఆ స్కూల్ ని నిర్మించాడు. అయితే ఈ విషయాన్ని సోనుసూద్ సన్నిహితుల ద్వారా తెలుసుకున్నారు.
ఈ విషయాన్ని తెలుసుకున్న సోనుసూద్ బీహార్ కు చేరుకున్నాడు.చేరుకున్న తదనంతరం సోనూసూద్ బీరేంద్ర కుమార్ ని కలిసారు. అక్కడ మరింత మెరుగైన విద్య..వసతి..నాణ్యమైన ఆహారం అందించేలా నిర్ణయం తీసుకున్నారు.
ఎక్కువ మంది అనాథ పిల్లలు చదువుకునే విధంగా ఓ పెద్ద భవనాన్ని నిర్మించడానికి సూన్ సూద్ నిర్ణయించారు. ఈ మధ్యనే కాలంలోనే పనులు కూడా మొదలు పెట్టినట్లు సమాచారం. ఈ సందర్భంగా సోనుసూద్ మాట్లాడుతూ.. ‘అణగారిగిన వర్గాలకు నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకొచ్చినప్పుడే దేశ పేదరికాన్ని తిరిమేయగలం. వాళ్లు బాగా చదువుకున్నప్పుడే మంచి ఉద్యోగాల్లో స్థిరపడగలరు.అని అన్నారు. ప్రస్తుతం సోనుసూద్ దేశ వ్యాప్తంగా పదివేల మంది పిల్లల్ని ఉచితంగా చదివిస్తున్నారు.అదేవిదంగా సోనుసూద్ తన తల్లి పేరుమీద అనాథ పిల్లలకు స్కాలర్ షిప్ లు కూడా అందిస్తున్నారు.