కర్ణాటక ఉప ముఖ్యమంత్రి,కాంగ్రెస్ పార్టీ రాష్ట్రా చీఫ్ డీకే శివకుమార్ తో వైఎస్ఆర్ టీపీ అధినేత వైఎస్ షర్మిల సోమవారం భేటీ అయ్యారు.కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తిసుకరావడానికి కీలకంగా వ్యహరించిన డీకే కు వైఎస్ఆర్ టీపీ అధినేత వైఎస్ షర్మిల అభినందనలు తెలిపారు.దాదాపు అర గంట పాటు సాగిన ఈ సమావేశంలో వైఎస్ఆర్ టీపీ పార్టీ ని కాంగ్రెస్ లో విలీనం చేసే అంశం పై షర్మిల డీకే తో చర్చిందని రాజకీయ పార్టీ లు భావిస్తున్నాయి. ఈ భేటిలో తాను పొత్తుల గురించి మాట్లాడలేదని చెప్పారు.ఈ భేటిలో తెలంగాణ స్థితి గతుల గురించి ప్రస్తావించానని చెప్పుకొచ్చింది.కేవలం తాను డీకే ను మర్యాదపూర్వకంగానే కలిశానని షర్మిల చెబుతున్నారు.
తెలంగాణలో కొంతకాలంగా వైఎస్ఆర్ టీపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తుల చర్చలు జరుగుతున్నాయని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.రాష్ట్రంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు వెల్లడించాయి.షర్మిల, డీకే ల భేటీ ఈ ప్రచారానికి జనాలకు మరింత క్లారిటి తెచ్చిపెట్టిందని రాజకీయ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఒక వేళ అదే నిజమైతే డీకే ను అడ్డం పెట్టుకొని మైండ్ గేమ్ ఆడే ఆలోచనలో ఉండవచ్చని మరో వాదన వినిపిస్తోంది.అది ఏలాగో అంటారా మరి….కాంగ్రెస్ పార్టీ తో పొత్తు లు కుదురితే మాత్రం ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ బాధ్యతలను షర్మిలకు అప్పగిస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. ఏపీ ముఖ్యమంత్రి, తన సోదరుడు జగన్ తో విభేదాలను పరిష్కరించుకునేందుకు డీకే శివకుమార్ మధ్యవర్తిత్వం వహించాల్సిందిగా కోరేందుకు షర్మిల కలిసి ఉండవచ్చన్న చర్చ జరుగుతుంది.