ఫేమస్ పోర్న్ స్టార్ మియా ఖలీఫాతో జబర్దస్త్ యాంకర్ రష్మీని పోల్చి అందరికీ షాక్ ఇచ్చాడు అటో రాం ప్రసాద్. న్యూ ఇయర్ కు స్వాగతం పలుకుతూ శ్రీదేవి డ్రామా కంపెనీలో ప్రత్యేక స్కిట్స్ చేశారు. రష్మీ, ఇమ్మాన్యూయేల్, అటో రాం ప్రసాద్ కలిసి ఓ స్కిట్ చేశారు. అందులో వీరు స్కూల్ పిల్లలుగా కనిపిస్తారు.
రష్మీని గౌనులో చూసిన ఇమ్మాన్యూయేల్ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందని అంటాడు. వెంటనే ఎక్కడో ఏంట్రా ఆమె మియా ఖలీఫా అంటాడు రాం ప్రసాద్. రష్మీని పోర్న్ స్టార్ తో పోల్చడంతో స్టేజ్ పైనున్న వారే కాకుండా జడ్జీలు కూడా నోరెళ్ళబెడతారు. చివరికి రష్మీ కూడా షాక్ అవుతుంది. టీచర్ గా కనిపించే ఇంద్రజ బెత్తంతో అటో రాం ప్రసాద్ కు నాలుగు వాతలు పెట్టి మందలిస్తుంది. పంచ్ ల పేరుతో రష్మీపై అటో రాం ప్రసాద్ వేసిన పంచ్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది.
నిజానికి, జబర్దస్త్ లో పంచ్ లు శృతి మించుతున్నాయి. కామెడి ముసుగులో మరీ రెచ్చిపోయి కౌంటర్లు పేల్చుతున్నారు. వివాదాలకు దారి తీస్తే సారీ చెప్పడం, కామెడి కోసం అలా మాట్లాడమని సంజాయిషీ ఇచ్చుకోవడం కామన్ అయిపొయింది.
తనపై జరుగుతోన్న బాడీ షేమింగ్ ను తట్టుకోలేకే జబర్దస్త్ ను వీడింది అనసూయ. దారుణంగా కామెంట్స్ చేయడం మనస్తాపానికి గురి చేసినట్లు చెప్పుకొచ్చింది. తనపై శృతి మించి జోకులు, సెటైర్లు వేసినప్పుడు సీరియస్ అయితే అందులో నుంచి ఆ షాట్స్ ఎడిటింగ్ లో కట్ చేస్తారని చెప్పింది అనసూయ.
యాంకర్ గా రష్మీ కొంతకాలం జబర్దస్త్ కు దూరం కావడంతో సౌమ్యరావు యాంకర్ గా కనిపించింది. అయితే ఆమె జబర్దస్త్ ను తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. హైపర్ ఆది పంచ్ లను భరించలేకే సౌమ్యరావు ఎక్స్ ట్రా జబర్దస్త్ ను వీడారని లేటెస్ట్ టాక్.
Also Read : సమంత ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్