ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీ దేశ సమైక్యతే లక్ష్యంగా గత 133 రోజుల క్రితం కన్యాకుమారిలో “భారత్ జోడో యాత్ర” రాహుల్ గాంధీ ప్రారంభించారు. ఈ భారత్ జోడో యాత్ర ముగింపు సభలో ఆయన మాట్లాడుతూ యాత్రకు కొనసాగింపుగా ఫిబ్రవరి ఆరో తేది నుంచి తెలంగాణలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో “హాథ్ సే హాథ్ జోడో “యాత్ర జరగనుందని తెలంగాణ ప్రజలకు రాహుల్ గాంధీ సందేశాన్ని పంపారు. ఇలాంటి యాత్రతోనే దేశ అభివృది సాధ్యమన్నారు.ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో బీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాలు విఫలమైయ్యాయని వాటికి సంబంధించిన చార్జిషీట్ ను నాలుగు పేజీల కరపత్రంలో కాంగ్రెస్ పార్టీ పొందుపరిచింది.
ప్రతి భారతీయుడు కలలు కన్న సమజాన్ని తీర్చిద్దిద్దుకోవడానికి “హాథ్ సే హాథ్ జోడో” యాత్రలో ప్రతి ఒక్కరు చేయి చేయి కలుపుకొని ముందుకు సాగాలని రాహుల్ గాంధీ తన సభలో పేర్కొన్నారు. కులాల పేరుతో, మతాల పేరుతో దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నా బీజేపీ పాలకుల నుంచి దేశాన్ని కాపాడుకునే భాద్యత మీ అందరిపై ఉందని పేర్కొన్నారు. ఈ సందేశం పొందు పరిచిన కరపత్రాన్ని “హాథ్ సే హాథ్” జోడో యాత్రలో సందర్బంగా రాష్ట్రంలోని ప్రతి గడపకు కాంగ్రెస్ కార్యకర్తలు అందజేయనున్నాయి.
తెలంగాణలో ఫిబ్రవరి ఆరో తేదిన భద్రాచలం నుండి టీపీసీసీ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరగనున్నా”హాథ్ సే హాథ్ “జోడో యాత్రను ప్రారభించేందుకు టీపీసీసీ ఏర్పాట్లు చేస్తోంది. ఆ రోజున లక్ష మందితో సభను నిర్వహించాని,ఈ సభకు సోనియా ,ప్రియాంక గాంధీల్లో ఒకరిని ఆహ్వానిచేందుకు ఇప్పటికే కాంగ్రెస్ ముఖ్య నేతలు ఏఐసీసీ కి లేఖ రాసారు.