కేరళ ప్రభుత్వం ఆదర్శనీయమైన నిర్ణయం తీసుకుంది. అమ్మాయిలు నెలసరి సమయంలో విద్యా సంస్థలకు హాజరు కాకపోయినా పరవాలేదని కీలక నిర్ణయం తీసుకుంది.
అమ్మాయిలకు నెలసరి రావడం సహజమే. నెలసరి సమయంలో విద్యార్థినులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి..అమ్మాయిలు ఆ సమయంలో కళాశాలలకు హాజరు కాకపోయినా పర్వాలేదంటూ ఆదేశాలు జారీ చేసింది. కన్న తల్లిలా అర్థం చేసుకున్నా కేరళ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
కేరళవ్యాప్తంగా పనిచేస్తున్న 14 యూనివర్సిటీల్లో విద్యార్థినులకు రెండు శాతం అదనంగా హాజరు మాఫీ అవకాశం కల్పించింది. కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ తొలిసారి ఈ నిర్ణయాన్ని అమలు చేసింది. జనవరి 11 నుంచి తమ విద్యార్థినులకు మెనుస్ట్రువల్ లీవ్ ఇస్తోంది.
ప్రతి సెమిస్టర్ లోనూ విద్యార్థులు కనీసం 75 శాతం హాజరు నిబంధన తప్పనిసరి అని కేరళ యూనివర్సిటీలు ప్రకటించాయి. దీనితో పాటు 18 సంవత్సరాలు నిండిన ప్రతి విద్యార్థినులకు రెండు నెలల మెటర్నిటీ లీవ్ ను కూడా ప్రకటించింది. అదేవిదంగా రెండు శాతం కండోనేషన్ మెనుస్ట్రువల్ లీవ్, రెండు నెలల మెటర్నిటీ లీవ్ ను యూనివర్సిటీల్లో విద్యార్థినులకు ఇవ్వాలని నిర్ణయించామంటూ ఉన్నత విద్యా శాఖ మంత్రి డాక్టర్ ఆర్. బిందు తెలిపారు.
అదేవిదంగా నెలసరి సమయంలో విద్యార్థినిలు శారీరక, మానసిక ఒత్తిడికి లోనవుతు..ఆ టైంలో వాళ్ళు కళాశాలలకు సరిగా రాలేకపోతున్నారు. కాబట్టి స్వయంగా కేరళ రాష్ట్ర పభుత్వం ఈ డిసిషన్ తీసుకుంది. ఇలాంటి నిర్ణయాలపై అక్కడి విద్యార్థినులతో పాటు వారి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.