ప్రభుత్వ బడులో చదివే విద్యార్థులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది.ప్రాథమిక బడులో చదివే ప్రతి విద్యార్థికి వర్క్ బుక్స్,ఉన్నత పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నోట్స్ బుక్స్ ఇవ్వాలని రాష్ట్రా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.సచివాలయంలో విద్యాశాఖ అధికారులతో మీటింగ్ నిర్వహించిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. ఈ మేరకు వివరాలను వెల్లడించారు.
పేద విద్యార్థులను మరియు విద్యా రంగం అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని సీఎం కేసీఆర్ తీసుకున్నగొప్ప ఈ నిర్ణయమన్నారు.కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం తెలంగాణ రాష్ట్రంలో 24లక్షల విద్యార్థులకు మేలు జరుగుతుందని మంత్రి సబితా ఇంద్రా రెడ్డి వెల్లడించారు. ప్రాథమిక విద్యార్థులకి వర్క్ బుక్స్,ఉన్నత పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నోట్స్ బుక్స్ ఈ విద్య సంత్సరంలో పునఃప్రారంభించాలని మంత్రి సబితా ఉన్నత అధికారులకు సూచించింది.200 కోట్లు కేటాయించి ఉచితంగా పాఠ్య పుస్తకాలు అందించేందుకు కేసీఆర్ ప్రణాళిక రూపొందించినట్లు మంత్రి తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలలోని ప్రతి విద్యార్థికి రెండు జతల యూనిఫామ్‌లను పాఠశాల పునః ప్రారంభమమే నాటికి ప్రతి విద్యార్థికి నోటు పుస్తకాల పంపిణీ, పాఠ్య పుస్తకాల పంపిణీ, యూనిఫామ్‌లను అందజేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. జూన్ 12వ నుంచి పాఠశాల పునః ప్రారంభమవుతున్నందున బడిబాట కార్యక్రమం ఏర్పాటు చేసి అందులో స్థానిక శాసనసభ్యులను, ప్రజాప్రతినిధులను భాగ్యస్వామ్యం చేయాలని సూచించారు.అదేవిదంగా శాసనసభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాఠశాలల్లో హాజరయ్యే సమయంలో విద్యార్థుల తల్లిదండ్రులను కూడా ఆహ్వానించాలని మంత్రి సూచించారు.