తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ టీఆర్ఎస్ పార్టీని (బీఆర్ఎస్) జాతీయ పార్టీగా మార్చుకున్న సంగతి తెలిసిందే. అయితే బీఆర్ఎస్ అవతరించిన నాటి నుండి ఆ పార్టీ మరింత దూకుడుతో ముందుకు వెళ్తుందని పార్టీ నేతలు చెప్పుతున్నారు.దీనికి ఉదాహరణగా రీసెంట్ గా ఖమ్మంలో జరిగిన తొలి ఆవిర్భావ సభకు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరైయ్యారని పార్టీ ముఖ్య నేతలు అన్నారు. అదేవిదంగా తెలంగాణ మరుమూల గ్రామాలా ల నుండి కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గోన్నరన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ బీఆర్ఎస్ సభను ఫిబ్రవరి 5న నాదేండ్ లో నిర్వహిస్తామని ప్రకటించాడు.ఈ సభకు మహారాష్ట్ర ప్రజలతో పాటు తెలంగాణ కార్యక్తలు కూడా భారిగా తరలి వస్తారని బీఆర్ఎస్ బాస్ లు భలే చెప్పుకుంటున్నారు. ఉన్న రాష్ట్రానే చక్క దిద్దలే కాని దేశ రాజకియలో ఏమి అభివృద్ధి చేస్తాడని ప్రతిపక్షాల నాయకులు బీఆర్ఎస్ నాయకులపై మండిపడ్డారు.
బీఆర్ఎస్ పార్టీ మరింత బలపడేందుకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ప్రోత్సాహం కెసీఆర్ కు అందుతుందన్నారు.ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఖమ్మం సభలో మాట్లాడుతూ జాతీయ స్థాయిలో పార్టీ బలపడేందుకు మా అందరి సహకారాలు అందుతాయన్నారు.ఫిబ్రవరి 5న మహారాష్ట్ర నాందేడ్ లో జరిగే ఆవిర్భావ సభ ఏర్పాట్లను ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే పరిశీలించారు.ఈ సందర్భంగా షిండే మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణలో కెసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు మహారాష్ట్ర ప్రజలు ఆకర్షితులవుతున్నారని చెప్పారు.
మీడియా ముందు తెలంగాణ లో కెసీఆర్ పెట్టినా పథకాల గురించి మాట్లాడినా షిండే పై తెలంగాణ ప్రతిపక్షాల నాయకులు మండిపడ్డారు. కెసిఆర్ పథకాల పై తెలంగాణా ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని ప్రతిపక్ష సీనియర్ నాయకులు తెలంగాణ ప్రజలు షిండే పై మండిపడ్డారు.తెలంగాణలో లేని తృప్తి.. మహారాష్ట్ర ప్రజలు కెసీఆర్ పథకాలపై ఎలా తృప్తి చెందుతానన్నారు.