తుర్కియే, సిరియాలో భూకంపం వస్తే తెలంగాణలో భూ ప్రకంపనలు రావడం ఏమిటని అశ్చర్య పోతున్నారా? ఇది ముమ్మాటికి నిజం. ఎందుకంటే ఇప్పుడు తెలుగు రాష్ట్రాలల్లో ఉన్న ముస్లింలల్లో చాలా మంది నైజాం పరిపాలనలో తుర్కియే నుంచి వలస వచ్చారు. అందుకే వాళ్ళను ‘తుర్కొల్లు’ (ముస్లిం) అని తెలంగాణలో ఇప్పటికి పిలుస్తారు.
మొదటినుంచి మన దేశం శాంతి కాముక దేశం. ఏ దేశం మీద దండయాత్ర చేయలేదు. కానీ మన దేశం మీద 18 దేశాలు దండయాత్ర చేసాయి. వాళ్ళల్లో చాలామంది ఇంక్కడే స్థిరపడ్డారు. అందుకే అనేక భాషలు, అనేక మతాలకు మన దేశంలో వెలసిల్లాయి. దానికి కారణం మన దేశంలో సిరి సంపదలు. దానికి మించి సామంత రాజుల పరిపాలలో ప్రతి జిల్లా ఒక దేశంగా మనుగడ సాగించడమే. అప్పటికే వైష్ణవులు, శివులు పేరుతో మత కలహాలు (ఇవి నాడు కులాలు కాదు) మనలో ఐక్యమత్యం లేకపోవడం.
నేక్కర్లు కూడా వేసుకోవడం చేతకాని డచ్ లాంటి బచ్చా దేశాలు కూడా మన దేశం మీద దండయాత్రలు చేశాయి. అంటే మనలో నాడున్న కొరవడిన ఐకమత్యం ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. దీనికి తోడూ నాడు మనదేశం నుంచి బంగారం, వెండి, వజ్రాలు, వైడుర్యాలు బియ్యం, పప్పుదినుసులు విదేశాలకు విరివిగా ఎగుమతి అయ్యవి.
ముక్యంగా మొగల్ చక్రవర్తుల పరిపాలనలో ఇస్లామిక్ దేశస్తులు పుంకాను పుంకాలుగా భారతదేశానికి వచ్చి వలవచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. ఔరంగాజేబ్ పరిపాలనలో తుర్కియే నుంచి చాలా మంది తెలంగాణకి వలస వచ్చారు. ముక్యంగా అప్పట్లో మేలు రకం ముత్యాలు, వజ్రాలకు, వైడుర్యాల కు తెలంగాణ ప్రపంచ రాజధానిగా వేలుగోండేది.
నాడు తెలంగాణలో భాగమైన రాయలసీమలో అంగట్లో రత్నాలు కుప్పలుగా పోసి అమ్మేవారు. ఇక్కడ అతి తక్కువలో ధరలో రతనాలు, వజ్రాలు, వైడుర్యాలు కొనేందుకు విదేశీయులు తండోపతండాలుగా వచ్చేవాళ్లు. ఇక్కడ కొన్నవాటిని తమ విదేశాల్లో ఎక్కువ ధరకు అమ్మేవారు. ప్రపంచంలోనే అతి విలువైన పది వజ్రలల్లో కోహినూర్, జాక్అప్ లాంటి ఆరు విలువైన వజ్రాలు తెలంగాణా మట్టిలో దొరికినవే. అందుకే నైజాం వంశస్తులు కూడా అక్కడి నుంచి వ్యాపారం పని మీద ఇక్కడికి వచ్చారు. ఆ తర్వాత ఇక్కడే స్థిరపడి రాజులుగా మారారు. చివరికి ప్రపంచ కుబేరులుగా ఎదిగారు.
టెన్నిస్ స్టార్ సానియా మిర్జా పాకిస్తానీ మల్లిక్ ని పెళ్లి చేసుకున్నట్లే ఇక్కడి తుర్కొల్లు దుబాయ్ షేకులను, తుర్కియే అబ్బాయిలను పెళ్లి చేసుకుని అక్కడికి వెళ్లి స్థిరపడ్డారు. ఇస్లామిక్ దేశస్తులను పెళ్లి చేసుకన్న వాళ్ళలో దుబాయ్ తర్వాత రెండో స్థానంలో తుర్కియేదే. ఇప్పటికి ఇక్కడి తుర్కొల్ల మూలాలు, బంధువులు అక్కడున్నారు. వాళ్లు భూకంపంలో చనిపోగా ఇక్కడి బంధువులు, మిత్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.