ఈ నాటి సమాజంలో వయసుతో సంభందం లేకుండా ఎర్ట్ అటాక్ లకు గురవుతున్నారు . సాధారణంగా అయితే 50,60 ఏళ్ళు దాటినా వాళ్ల మాత్రమే ఎర్ట్ అటాక్ లకు గురవుతారు.కానీ మరి ఇంత చిన్న వయసులో రావడం అనేది ఆశర్యకరమైన విషయమే.రీసెంట్ గా ఆరో తరగతి చదువుతున్నా 13 ఏళ్ల బాలిక నిద్రలో గుండె పోటు తో మరణించింది.
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం అబ్బాయిపాలెం శివారులోని బోడతండాకు చెందిన స్రవంతి (13) స్థానిక ప్రైవేటు పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది.అయితే గురువారం రోజున శ్రీ రామ నవమి సెలవు రోజున తన స్నేహితుల ఇంటికి వెళ్లి ఆ రోజంతా స్నేహితురాళ్లతో కలిసి ఆడుకుంది.స్నేహితుల ఇంటి నుండి తిరిగి ఇంటికి వచ్చిన స్రవంతి ఆ రోజు రాత్రి ఒక్కసారి గా కుప్పకూలిపోయింది.
వెంటనే స్రవంతి తల్లితండ్రులు దగ్గరలో ఉన్నఆర్ఎంపీ డాక్టర్ వద్దకు తీసుకెళ్లారు.అప్పటికే స్రవంతి గుండెపోటు తో మరణించిందని స్తానిక డాక్టర్ నిర్దారణ చేశాడు.ఈ విషయం తెలుసుకున్న స్రవంతి తల్లితండ్రులు మరియు తాండ వాసులు శ్లోక సంద్రం లో మునిగి తేలారు.