దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఐపీఎల్ ఎప్పుడెప్పుడా? అని ఎదురుచూస్తున్నారు. ఐపీఎల్ జట్లన్నీ సమరానికి సిద్దమయ్యాయి. ఈ నెల 31న తొలి మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య పోటా పోటిగా తలపడనున్నాయి. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన మహేంద్రసింగ్ ధోనీ ఐపీఎల్ లో కొనసాగుతున్నాడు. ఈ క్రమంలోనే ఈ ఐపీఎల్ సీజన్ తర్వాత ధోని ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తాడా? అని వస్తున్న వార్తలపై క్లారిటి ఇచ్చాడు ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహితశర్మ.
రోహిత్ శర్మ స్పందిస్తూ… మహేంద్ర సింగ్ ధోని ఇప్పట్లోఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ కాబోడని,ఇంకా రెండేళ్ళ పాటు తాను ఆడుతాడని చెప్పుకొచ్చారు. ముంబై ఇండియన్స్ ఏప్రిల్ 2న రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో తొలి మ్యాచ్‌లో తలపడుతుంది. ఈ నేపథ్యంలో నిన్న ముంబై ఇండియన్స్ తమ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ప్రీ సెషన్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించింది. దీనికి రోహిత్ శర్మ, కోచ్ మార్క్ బౌచర్ హాజరయ్యారు.ఈ ప్రీ సెషన్ ప్రెస్ కాన్ఫరెన్స్ రోహిత్ శర్మ మాట్లాడుతూ..ధోని రిటైర్మెంట్ గురించి రెండు సంవత్సరాల నుండి వింటున్నాను అని రోహిత్ చెప్పాడు. కాని ధోని ఎప్పటి వరకు ఆ నిర్ణయం తీసుకోలేదు కాబట్టి ఇంకా కొన్ని సిజన్ల వరకు తాను ఆడేందుకు ఫిట్ గానే ఉన్నాడని అన్నారు.
చెన్నై సూపర్ కింగ్స్ సారథి ధోనీ ఇప్పటికీ ఆ జట్టులో కీలక ఆటగాడిగానే కొనసాగుతున్నాడు. ఐపీఎల్ టోర్నీ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు చెన్నై టీమ్ తరుపున ఆడుతున్న ధోనీ 234 మ్యాచుల్లో 4,978 పరుగులు చేశాడు. తాను కెప్టెన్ గా వుండి నాలుగు టైటిళ్లు అందించాడు. అయితే 2023 లో జరిగే సీజన్ లో ఇది చివరి ఆట అని గతంలో చిన్న ప్రకటన చేశాడు. మరి ఈ సీజన్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటిస్తాడా?లేదా కొనసాగిస్తాడా?అన్నది చూడాలి.