ఈ ఏడాది చివరలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయం మని..కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు.కర్ణాటక ఎన్నికల ఫలితంగా బీజేపీ కి భయం పుట్టిందని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.దీని ఫలితంగా వచ్చే ఎన్నికల తర్వాత తెలంగాణలో బీజేపీ ఆనవాళ్లు కూడా ఉండవని వ్యక్త పరిచాడు.మత ద్వేషాలతో పని చేస్తున్న బీజేపీ ని,ఎన్నికలు జరిగే అన్ని రాష్ట్రాల్లో ప్రజలు ఓడించనున్నారని రాహుల్ గాంధీ అన్నారు.భారతీయ ప్రవాస కాంగ్రెస్-అమెరికా విభాగం న్యూయార్క్లో ఏర్పాటు చేసిన విందు సమావేశంలో రాహుల్ మాట్లాడారు.
తెలంగాణతోపాటు మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటక ఫలితాలగే అన్ని రాష్ట్రాలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందన్నారు . 2024 ఎన్నికల్లోనూ అదే జరుగుతుందన్నారు. దేశంలో విపక్షాలన్నీ ఏకం అయి బీజేపీ ని ఓడించే దిశగా పనిచేస్తున్నాయి అన్నారు .. బీజేపీని ఘోరంగా ఓడించగలమని కర్ణాటక ఎన్నికల ద్వార బీజేపీ కి బుద్ది చెప్పమన్నారు.కేవలం ఓడించడం కాదు.. ఆ పార్టీని తుడిచిపెట్టేశామన్నారు.
ఇంక రాను రాను రోజుల్లో బీజేపీ కనుమరుగైయే రోజులు వస్తాయన్నారు.’కర్ణాటక ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ ఎన్నో రకాలుగా ప్రయత్నించింది.కాని అక్కడి ప్రజలు కాంగ్రెస్ కు మంచి ఫలితాన్ని ఇచ్చి బీజేపీ కి బుద్ది చెప్పారు అని రాహుల్ గాంధీ వాఖ్యానించారు.అధికారంలో ఉన్న ఆ పార్టీ ని ప్రజా బలంతోనే మట్టిలో కరిపించాం’ అని రాహుల్ చెప్పారు.ఎన్ని రకాలుగా ప్రయత్నించిన ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా ఈ ఏడాది చివర్లో జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయం మని..కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సవాల్ విసిరాడు.మరి ఇది ఎలా సాధ్యం..? రాహుల్ ధైర్యం వెనుక ఉన్న ధీమా ఏంటి? అని రాజకీయ పార్టీ లో చర్చనియంశంగా మారింది.
తెలంగాణలో తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి తో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు కేసీఆర్ సర్కారుపై విమర్శలు చేయడంతోపాటు.. పార్టీని బలోపేతం చేయడంలోనూ ముందున్నారు.అంతే కాకుండా ఇతర పార్టీల నుంచి వచ్చేనాయకులకు రెడ్ కార్పెట్ పరుస్తామని కాంగ్రెస్ లో వారికి తగిన ప్రాధాన్యత ఉంటుందని రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు.