అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో బీజేపీ నాయకులు నీచ రాజకీయాలు చేస్తున్నాయని పార్టీ అంతర్గత విషయాలు మెల్లమెల్లగా బయటికి వస్తున్నాయి .కాని తెలంగాణ లో రోజు రోజు కు బీజేపీ రాజకీయాల తీరు మరింత నీచంగా దిగజారిపోతుంది.తెలంగాణ బీజేపీ అధినేత బండి సంజయ్ మత కులాల మధ్య చిచ్చు పెట్టడంలో ఒక్క బ్రాండ్ మాస్టరన్ని చెప్పొచ్చో.నోరు విప్పితే చాలు మత,కులాల గురించి మాట్లాడడంలో మంచి మాటకారి .అంతే కాకుండా మతాల పేరుతో కులాల పేరుతో రాజకీయ జీవితాన్ని నడుపుతూవుంటాడు బండి సంజయ్. అదేవిదంగా బీజేపీ ముఖ్య నాయకులు బండి సంజయ్ వ్యవహార శైలి విషయంలో అసంతృప్తిగా ఉన్నామని వ్యక్తపరుస్తున్నారు.
బండి విషయంలో ఎందుకు అసంతృప్తిగా ఉన్నమని కొందరి నేతల ప్రశ్నలకు సమాధానమే లేకుండా పోయింది. కాని కొందరు ముఖ్యనేతలు ముక్కు సూటిగా చెప్పేసుకుంటున్నారు.బండి సంజయ్ కు పార్టీలో తనకు తొత్తులుగా వున్న వాళ్లకు మాత్రమే పార్టీ టికెట్లు ఇచ్చే అవకాశం వుందని అంటున్నారు.బండి తనకు తొత్తుగా వున్నా నాయకులకే ఇవ్వాలన్న ఆలోచనలో ఆ పార్టీ నాయకులు అసంతృప్తిగా ఉన్నమంటున్నారు.తొత్తు వున్నా నాయకులకు కాదు ప్రజా అభివృద్ధికి పాటు పడే నాయకులకు టికెట్లు ఇవ్వాలి అంటూ నేతలు బండి పై మండిపడుతున్నట్టు తెలుస్తోంది.
మరి బండి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటరన్నది వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు వేచి చూడాలి. ఒక్కవేళ బండి సంజయ్ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే మాత్రం సీనియర్ నాయకులు బీజేపీకి చెక్ పెడుతారా లేదా పార్టీలోనే ఉంటారా అనేది చర్చనీయాంశంగా మారింది.