Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Author: Chelamala Vishnu
ఈ నాటి సమాజంలో వయసుతో సంభందం లేకుండా ఎర్ట్ అటాక్ లకు గురవుతున్నారు . సాధారణంగా అయితే 50,60 ఏళ్ళు దాటినా వాళ్ల మాత్రమే ఎర్ట్ అటాక్ లకు గురవుతారు.కానీ మరి ఇంత చిన్న వయసులో రావడం అనేది ఆశర్యకరమైన విషయమే.రీసెంట్ గా ఆరో తరగతి చదువుతున్నా 13 ఏళ్ల బాలిక నిద్రలో గుండె పోటు తో మరణించింది. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం అబ్బాయిపాలెం శివారులోని బోడతండాకు చెందిన స్రవంతి (13) స్థానిక ప్రైవేటు పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది.అయితే గురువారం రోజున శ్రీ రామ నవమి సెలవు రోజున తన స్నేహితుల ఇంటికి వెళ్లి ఆ రోజంతా స్నేహితురాళ్లతో కలిసి ఆడుకుంది.స్నేహితుల ఇంటి నుండి తిరిగి ఇంటికి వచ్చిన స్రవంతి ఆ రోజు రాత్రి ఒక్కసారి గా కుప్పకూలిపోయింది. వెంటనే స్రవంతి తల్లితండ్రులు దగ్గరలో ఉన్నఆర్ఎంపీ డాక్టర్ వద్దకు తీసుకెళ్లారు.అప్పటికే స్రవంతి గుండెపోటు తో మరణించిందని స్తానిక డాక్టర్…
తెలంగాణలో ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ కేసీఆర్ దూకుడు పెంచుతున్నారు. ఎవరి పనితీరు ఎలా ఉంది..? ప్రజా వ్యతిరేకత మూటగట్టుకుంటున్న ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు.? అనే దానిపై వరుసగా సర్వేలు చేయిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 25 మంది ఎమ్మెల్యేల పని తీరు బాగాలేదని కేసీఆర్ చేయించిన సర్వే ఫలితాల్లో తేలినట్లు తెలుస్తోంది. ఇందులో ఇద్దరు మంత్రులు కూడా ఉన్నారని.. వీరికి వచ్చే ఎన్నికలో టికెట్ దక్కడం కష్టమేనని పార్టీలో చర్చ జరుగుతుంది. కేసీఆర్ మూడు నెలల ముందే అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్ళే అవకాశముందని ప్రతిపక్షాలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికార బీఆర్ఎస్ తో పాటు ప్రతిపక్షాలు కూడా ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. అందుకే బీఆర్ఎస్ లో టిక్కెట్ దక్కించుకోవాలనే ఆశావహుల సంఖ్య రోజు రోజుకు ఎక్కువ అవుతోంది. సిట్టింగ్ లపై వ్యతిరేకత ఉండటంతో గత ఎన్నికలో టికెట్ దొరకని నాయకులు ఈసారైన ఎలాగైనా టికెట్ దక్కించుకోవాలని ఆరాటపడుతున్నారు.…
దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఐపీఎల్ ఎప్పుడెప్పుడా? అని ఎదురుచూస్తున్నారు. ఐపీఎల్ జట్లన్నీ సమరానికి సిద్దమయ్యాయి. ఈ నెల 31న తొలి మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య పోటా పోటిగా తలపడనున్నాయి. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన మహేంద్రసింగ్ ధోనీ ఐపీఎల్ లో కొనసాగుతున్నాడు. ఈ క్రమంలోనే ఈ ఐపీఎల్ సీజన్ తర్వాత ధోని ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తాడా? అని వస్తున్న వార్తలపై క్లారిటి ఇచ్చాడు ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహితశర్మ. రోహిత్ శర్మ స్పందిస్తూ… మహేంద్ర సింగ్ ధోని ఇప్పట్లోఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ కాబోడని,ఇంకా రెండేళ్ళ పాటు తాను ఆడుతాడని చెప్పుకొచ్చారు. ముంబై ఇండియన్స్ ఏప్రిల్ 2న రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో తొలి మ్యాచ్‌లో తలపడుతుంది. ఈ నేపథ్యంలో నిన్న ముంబై ఇండియన్స్ తమ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ప్రీ సెషన్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించింది. దీనికి రోహిత్ శర్మ, కోచ్ మార్క్ బౌచర్…
తెలంగాణ సీనియర్ రాజకీయ నాయకురాలు ఇందిరా శోభన్ టీడీపీలో చేరనున్నారా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. ప్రస్తుతం ప్రాథమిక స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని…టీడీపీలో చేరేందుకు ఆమె అంగీకరిస్తే త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. తెలంగాణ రాజకీయాల్లో అగ్రెసివ్ గా కనిపించే మహిళా నేతల్లో ఇందిరా శోభన్ ఒకరు. కాంగ్రెస్ ద్వారా రాజకీయ అరంగేట్రం చేసిన ఇందిరా శోభన్.. ఉత్తమ్ వ్యవహారశైలి నచ్చక కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు. ఆ తరువాత రాజన్న రాజ్యం అంటూ వైఎస్సార్ తెలంగాణపార్టీని స్థాపించిన వైఎస్ షర్మిల పార్టీలో చేరారు. అక్కడ ఆధిపత్య రాజకీయాల కారణంగా వైఎస్సార్ టీపీని కూడా వీడారు. అనంతరం స్వతంత్రంగా రాజకీయాలు చేసిన ఇందిరా శోభన్ కొంతకాలం తరువాత అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ లో చేరారు. ఆ పార్టీ బలోపేతం కోసం బాగానే కష్టపడ్డారు. పాదయాత్రలు చేశారు. ఢిల్లీ మోడల్ అంటూ గ్రేటర్ హైదరాబాద్…
ఆప్ కు రాజీనామా చేసిన ఇందిరా శోభన్ పొలిటికల్ చౌరస్తాలో నిలుచున్నారు. కాంగ్రెస్ నుంచి వైఎస్సార్ తెలంగాణ పార్టీ , ఆ తరువాత ఆమ్ ఆద్మీ పార్టీలు మారారు. బీఆర్ఎస్ తో ఆప్ దోస్తీ చేస్తుందంటూ ఇందిరా శోభన్ ఇటీవల ఆప్ కు గుడ్ బై చెప్పేశారు. ఇప్పుడు ఆమె ఏ పార్టీలో చేరుతారనేది ఆసక్తికరంగా మారింది. ఆరు దశాబ్దాల ప్రత్యేక రాష్ట్ర కళను సాకారం చేసిందని 2014లో కాంగ్రెస్ లో చేరారు ఇందిరా శోభన్. పార్టీలో అధికార ప్రతినిధిగా కొనసాగుతూ ఆమె పార్టీ వాయిస్ ను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళారు. నిత్యం టీవీ డిబేట్ లో కనిపిస్తూ ప్రత్యర్ధి పార్టీలకు చెందిన నేతలను ఇరుకునపెట్టేవారు. అలా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి చేపట్టిన పాదయాత్రలో ఆమె కూడా పాల్గొన్నారు. అదే సమయంలో మహిళా కాంగ్రెస్ అద్యక్షురాలిగా ఇందిరా శోభన్ పేరు…
ఈ రోజులో పెళ్లి అయ్యి సంవత్సరాలు గడిచినా దంపతులకు సంతానం లేక చాలా మంది మనస్థాపానికి గురవుతున్నారు.ఎందుకంటే వాళ్ళు తిసుక్కునే ఆహరం వల్ల కాని ఆరోగ్య సమస్యలతో సంతానం కావడం చాలా కష్టతరంగా మారింది.ఇలా సంతానం కాని దంపతలు దత్తత తీసుకొని తల్లితండ్రులుగా మారుతున్నారు.ఇంతకు ముందు సంతానం లేని వాళ్ళు కేవలం అబ్బాయిలనే దత్తత తీసుకునేవారు.కాని కొంత కాలం నుండి అమ్మాయిలను దత్తత తీసుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.దత్తతకు పాపే కావాలని కోరుకునే దంపతులు ఎక్కువవుతున్నారని తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు వెల్లడించారు. ఇది ఇప్పుడు ఒక ట్రెండ్ మారింది అంటున్నారు. ఇలా రోజు రోజుకు సంతానం లేని కారణంగా దరఖాస్తులు అధికంగా వస్తున్నాయని శిశు సంక్షేమ శాఖ అధికారులు తెలిపారు.ఒకవేళ దత్తతగా పిల్లల్ని తీసుకోవాలి అనుకునేవారు మహిళా శిశు సంక్షేమ శాఖకు దరఖాస్తు చేసుకోవాలి.వచ్చిన దరఖాస్తులను ఉన్నత అధికారులు పరిశీలించి,విచారణ జరిపి లీగల్ గా దత్తతకు…
ఆమ్ ఆద్మీ పార్టీకి ఇందిరా శోభన్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను కాసేపటి క్రితమే మీడియాకు రిలీజ్ చేశారు. పార్టీని ఎందుకు వీడుతున్నారో స్పష్టత ఇవ్వలేదు కాని ఇన్నాళ్ళు పార్టీలో తనను ప్రోత్సహించిన నేతలకు రాజీనామా లేఖలో ఆమె కృతజ్ఞతలు తెలిపారు. అయితే…అవినీతి పరుడైన కేసీఆర్ కు ఆప్ మద్దతు ఇవ్వడంతోనే ఇందిరా శోభన్ రాజీనామా చేసినట్లు ఆమె సన్నిహిత వర్గాలు చెప్పుకోచ్చాయి. బీఆర్ఎస్ నిర్ణయాలకు ఆప్ వత్తాసు పలకడం మనస్తాపానికి గురి చేసిందని.. అందుకే పార్టీ వీడినట్లు చెప్పారు. ఇందిరా శోభన్ కాంగ్రెస్ ను వీడిన నాటి నుంచి ఆమె రాజకీయ పరిస్థితి కాస్త గందరగోళంగానే ఉంది. కాంగ్రెస్ కు రాజీనామా చేసిన ఇందిరా శోభన్ ఆ తరువాత వైఎస్ షర్మిల స్థాపించిన వైఎస్సార్ తెలంగాణ పార్టీలో చేరారు. షర్మిలకు కుడిభుజంగా ఉన్న ఆమె పార్టీలో ఆధిపత్య,గ్రూప్ రాజకీయాలకు ఇమడలేక వైఎస్సార్ తెలంగాణ పార్టీని వీడారు. ఆ తరువాత…
అమెరికాలో మళ్ళి తుపాకుల మోత కొనసాగుతుంది.దుండగుల చేతిలో బలైపోతున్నా ఇండియాన్స్ కు అమెరికాలో వుండడం కష్ట కాలమే.ఒంటరిగా కనిపిస్తే చాలు తుపాకిలతో బెదిరిస్తూ కావలసినన్ని డబ్బులు డిమాండ్ చేస్తున్నారు.ఇంకేముంది అసలే బయటి దేశం ఇవ్వక తప్పదు.. మన ఇండియాన్స్ కు లేదంటే ప్రాణానికే ముప్పు తెస్తున్నారు.ఇలా కన్నా తల్లి తండ్రులను,వున్నా ఊరిని వదిలి కుటుంబ పోషణకై బయటి దేశం వెళ్తున్నా ఇండియాన్స్ అమెరిక దుండగుల చేతిలో బలైపోతున్నారు.అదేవిదంగా గతవారం లాస్ ఏంజెలెస్ సమీపంలోని మాంటెరీ పార్కు నగరంలో చైనీస్ న్యూ ఇయర్ వేడుకలపై జరిగిన కాల్పుల్లో 10 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 10 మంది గాయపడ్డారు.గాయపడిన ఆ 10 మంది హాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అంతే కాకుండా పలు ప్రాంతాల్లో దుండగులు కాల్పులు జరుపుతున్నారు.తాజా గా ఫ్లోరిడాలో జరిగిన కాల్పులో కనీసం 10 మంది గాయపడ్డారు.ఈ సంఘటనను లేక్‌ల్యాండ్ పోలీసులు నిర్ధారించింది. ఈ దుండగులు సోమవారం మధ్యాహ్నం కాల్పులు జరిగాయని,…
ప్రస్తుత ఎమ్మెల్సీ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత వచ్చే ఎన్నికల్లో ఎక్కడ నుండి పోటి చేస్తారన్నది పార్టీలో చర్చనీయంశంగా మారింది.ఎమ్మెల్యేగానా..? ఎంపీగానా..? అనే చర్చ బీఆర్ఎస్ లో హాట్ టాపిక్ గా మారింది.2014 లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీ స్థానం నుండి పోటి చేసి విజయం సాధించి మొదటి సారిగా పార్లమెంట్ లో అడుగుపెట్టారు.ఆ తర్వాత 2019 లో జరిగిన ఎన్నికల నుండి మళ్ళీ ఎంపీగా పోటీచేసి ఓడిపోయి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. కేసీఆర్ టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మరినా తర్వాత కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు పూర్తిగా జాతీయ రాజకీయాల మీద దృష్టి పెట్టారు.కేసీఆర్ కవితను తెలంగాణ నుండే ఎన్నికల బరిలోకి దింపుతాడా లేక తనతో పాటు దేశ రాజకియలోకి తిసుకేల్తాడా అనేది రాష్ట్ర రాజకీయలో చర్చనీయంశంగా మారింది.అయితే కొందరి సినీయర్ నాయకుల నుంచి అందుతున్న సమాచారం మేరకు కవితకు నిజామాబాద్ ఎంపీ టికెట్ ఖాయమని తెలుస్తోంది.…
అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో బీజేపీ నాయకులు నీచ రాజకీయాలు చేస్తున్నాయని పార్టీ అంతర్గత విషయాలు మెల్లమెల్లగా బయటికి వస్తున్నాయి .కాని తెలంగాణ లో రోజు రోజు కు బీజేపీ రాజకీయాల తీరు మరింత నీచంగా దిగజారిపోతుంది.తెలంగాణ బీజేపీ అధినేత బండి సంజయ్ మత కులాల మధ్య చిచ్చు పెట్టడంలో ఒక్క బ్రాండ్ మాస్టరన్ని చెప్పొచ్చో.నోరు విప్పితే చాలు మత,కులాల గురించి మాట్లాడడంలో మంచి మాటకారి .అంతే కాకుండా మతాల పేరుతో కులాల పేరుతో రాజకీయ జీవితాన్ని నడుపుతూవుంటాడు బండి సంజయ్. అదేవిదంగా బీజేపీ ముఖ్య నాయకులు బండి సంజయ్ వ్యవహార శైలి విషయంలో అసంతృప్తిగా ఉన్నామని వ్యక్తపరుస్తున్నారు. బండి విషయంలో ఎందుకు అసంతృప్తిగా ఉన్నమని కొందరి నేతల ప్రశ్నలకు సమాధానమే లేకుండా పోయింది. కాని కొందరు ముఖ్యనేతలు ముక్కు సూటిగా చెప్పేసుకుంటున్నారు.బండి సంజయ్ కు పార్టీలో తనకు తొత్తులుగా వున్న వాళ్లకు మాత్రమే పార్టీ టికెట్లు ఇచ్చే అవకాశం వుందని…