అమెరికాలో మళ్ళి తుపాకుల మోత కొనసాగుతుంది.దుండగుల చేతిలో బలైపోతున్నా ఇండియాన్స్ కు అమెరికాలో వుండడం కష్ట కాలమే.ఒంటరిగా కనిపిస్తే చాలు తుపాకిలతో బెదిరిస్తూ కావలసినన్ని డబ్బులు డిమాండ్ చేస్తున్నారు.ఇంకేముంది అసలే బయటి దేశం ఇవ్వక తప్పదు.. మన ఇండియాన్స్ కు లేదంటే ప్రాణానికే ముప్పు తెస్తున్నారు.ఇలా కన్నా తల్లి తండ్రులను,వున్నా ఊరిని వదిలి కుటుంబ పోషణకై బయటి దేశం వెళ్తున్నా ఇండియాన్స్ అమెరిక దుండగుల చేతిలో బలైపోతున్నారు.అదేవిదంగా గతవారం లాస్ ఏంజెలెస్ సమీపంలోని మాంటెరీ పార్కు నగరంలో చైనీస్ న్యూ ఇయర్ వేడుకలపై జరిగిన కాల్పుల్లో 10 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 10 మంది గాయపడ్డారు.గాయపడిన ఆ 10 మంది హాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
అంతే కాకుండా పలు ప్రాంతాల్లో దుండగులు కాల్పులు జరుపుతున్నారు.తాజా గా ఫ్లోరిడాలో జరిగిన కాల్పులో కనీసం 10 మంది గాయపడ్డారు.ఈ సంఘటనను లేక్‌ల్యాండ్ పోలీసులు నిర్ధారించింది. ఈ దుండగులు సోమవారం మధ్యాహ్నం కాల్పులు జరిగాయని, కనీసం 10 మంది గాయపడ్డారని, వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు లేక్‌ల్యాండ్ పోలీసులు వెల్లడించారు.
ఆ దుండగులు డార్క్ బ్లూ కలర్ నిస్సాన్ కారులో వచ్చినట్టు పోలీసులు తెలిపారు.అదేవిదంగా ఆ కారులో నలుగురు దుండగులు ఉన్నట్టు చెప్పారు.ఈ క్రమంలో ఆ నలుగురు దుండగులు కిటికీ అద్దాలను దించి వాహనాన్ని నెమ్మదిగా పోనిస్తూ కాల్పులకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. కారులో నుంచే వారు కాల్పులకు పాల్పడ్డారని, నిందితులందరూ పురుషులేనని పేర్కొన్నారు. గాయపడిన వారిలో ముగ్గురిని మాత్రమే అత్యవసర చికిత్సకు తరలించినట్టు తెలిపారు. వాళ్ళంతా యువకులేన్ని పేర్కొన్నారు.