కేటీఆర్ ముందస్తు ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేసారు. శనివారం కేటీఆర్ నిజామాబాద్ లో పర్యటించారు.ఈ క్రమంలో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ ముందస్తు ఎన్నికలకు మేము ఎప్పుడైనా సిద్దంగా ఉన్నామని స్పష్టం చేసారు.కాకపోతే బీజేపీ పార్లమెంట్ ను రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వస్తే..బీఆర్ఎస్ పార్టీ కూడా అసెంబ్లీ ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు తాము ఎప్పుడైనా రెడీగా ఉన్నామని బీజేపీ నాయకులపై కేటీఆర్ సవాల్ విసిరాడు.
ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.బీజేపీ ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రం మీద ఎలాంటి చిత్తశుద్ది లేదన్నారు.తెలంగాణ కు ఇస్తానన్న హామీలు ఓ ఒక్కటి నేరవేర్చలేదన్నారు.బడ్జెట్ విషయంలోకి వస్తే బీజేపీ ప్రభుత్వం ఒక్క పైసా కూడా తెలంగాణకు ఇవ్వలేదు అన్నారు.అయితే కొంత మంది బీజేపీ నాయకులు మాత్రం బీజేపీ ఇచ్చిన హామీలన్ని నెరవేర్చిందని డబ్బా కొట్టుకుంటూనారన్ని కేటీఆర్ మండిపడ్డాడు.అదేవిదంగా నేను చెప్పింది అబద్దం అయితే నా పదవికి రాజీనామా చేస్తానని బీ జే పీ నేతల పై కె టీ ఆర్ సవాల్ విసిరాడు.
తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ బర్త్ డే సందర్బంగా వచ్చే నెల 17న కొత్త సెక్రటేరియట్‌కు కేసీఆర్ ప్రారంభోత్సవం చేయనున్నారు. అదే సమయంలో ఆయన స్వంత జిల్లాల పర్యటనలు చేస్తుండటం, బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు చేయడంతో త్వరలో అసెంబ్లీని రద్దు చేసే ఆలోచనలతో ఉన్నారన్న చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్దంగా ఉన్నామని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.మేము ముందస్తు ఎన్నికలకు సిద్దం మీరు రెడినా….కేటీఆర్ సవాలన్నారు.