ఇదేం పోయే కాలం రా బాబు..కుమారుడు మృతి తో ఒంటరిగా అయిన కోడలిని పెండ్లి చేసుకున్నాడు ఓ మామ. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ జిల్లా చపియా ఉమ్రావ్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఓ ఇంట్లో ఈ ఘటన చోటుచేసుకుంది.కైలాష్ యాదవ్ దంపతులకు నలుగురూ సంతానం. కైలాష్ యాదవ్ అందరికి విహాహాలు చేశాడు.అయితే కైలాష్ భార్య గత 12 సవంత్సరాల కిందట మృతి చెందింది. ఆనాటి నుండి తాను ఒంటరిగా మిగిలిపోయాడు.
కైలాష్ యాదవ్ తన ఒంటరి జీవితాన్ని నడుపుతున్నాడు.అయితే ఈ క్రమంలో కైలాష్ యాదవ్(70 ) బర్హల్‌గంజ్ పోలీస్ స్టేషన్లో వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు.మరో వైపు కొన్నేళ్ళ క్రితం తన మూడో కూమరుడు చనిపోయాడు.అప్పటి నుంచి తన కూమారుడి భార్య పూజ(28 ) ఒంటరిగా మారింది.అప్పటి నుండి ఒంటరిగా ఉన్నా తన కొడలిని కైలాష్ యాదవ్ పెండ్లాడాలని నిర్ణయించుకున్నాడు.ఇలా నిర్ణయించుకున్న కైలాష్ తన కోడలితో కలిసి స్థానిక గుడిలో ఒక్కరికి ఒక్కరు దండలు మార్చుకొని ఒక్కటయ్యారు.28 ఏళ్ల కోడలితో 70 ఏళ్ల మామతో పెండ్లేంటి అని నెటిజన్లు ఆశ్యర్యపోయారు.
ఈ విహహానికి పూజ తరుపున వారి బంధువులతో పాటు ,గ్రామస్తులు కూడా పాల్గొన్నారు.వీరిద్దరి విహాహం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులకు ఈ విషయం తెలిసింది.అయిన పోలీస్ లు ఎలాంటి జ్యోక్యం చేసుకోకుండా నిశబ్దంగా ఉన్నారు.ఎందుకంటే వారిద్దరి విహాహం పై గ్రామస్తులు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని బర్హల్‌గంజ్ పోలీస్ స్టేషన్ ఇన్చార్జ్ తెలిపారు. వీరిద్దరి ఒప్పందాల మేరకే పూజ కైలాష్ ల పెండ్లి జరిగిందని కాబట్టి తాము ఈ విషయంలో ఎలాంటి జోక్యం చేసుకోని కేసు నమోదు చేయలేదని స్పష్టం చేశారు.