సీనియర్ నటీ జమున సినీ ప్రయాణంలో మంచి పేరు గాంచిన నటిగా గుర్తింపు పొందింది. కొన్ని దశాబ్దాలుగా సిని రంగంలో మంచి అనుభవం ఉన్న నటియే అని చెప్పొచ్చు.ఎన్టీఆర్, ఏఎన్నార్ లతో కలిసి అనేక మూవీలో ఆమె నటించారు. తెలుగు, తమిళ, కనడ, హిందీ, భాషలలో ఆమె నటించి ప్రేక్షకుల హృదయాలను ఆకట్టుకుకున్నారు. ఇలాంటి నటి మరణం సినీ రంగానికి తీరని లోటని ఆమె అభిమానులు సినీ వర్గాలు చెప్పుకోచ్చాయి.
అలనాటి అందాల జమున ఇక లేరు. వివిధ భాషలో నటించి ప్రేక్షకుల మనస్సును ఆకర్షించింది. అయితే కొన్ని రోజుల నుంచి వృద్ధాప్య సంబంధిత వ్యాధులతో భాదపడుతున్న జమున శుక్రవారం తుది శ్వాస విడిచింది.జమున లేరనేవార్త ఆమె అభిమానులకు, సీని వర్గాలను తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది.ఆమె మృతికి సినీ ప్రముఖులు, ప్రేక్షకులు సంతాపం తెలిపారు.
సీని నటి జమున జీవిత చరిత్ర చూస్తే ఆమె 193 6 ఆగస్టు 30న హంపిలో జన్మించారు.సీని రంగంలో నటించాలన్న కోరిక ఆమెలో ఉండేది.ఈ క్రమంలో జమున 1953 లో పుట్టిల్లు మూవీ తో సీని రంగంలో అడుగుపెట్టింది.వచ్చిన అవకాశాని చాలా చక్కగా వినియోగించుకొని తన కంటూ ఒక్క ప్రత్యేక గుర్తుంపు తెచ్చుకుంది.పుట్టిలు మూవీ తో సినీ రంగంలో తిరుగు లేని నటి గా ప్రేక్షకులా మనస్సును దోచేసింది. తెలుగు, కన్నడ, తమిళ, హిందీ సినిమాల్లో నటిస్తూ సత్య భామ పాత్ర ఆమె సక్సెస్ కు మరింత తోడైంది.ఇంకా ఇలా చెప్పుకొస్తే మిస్సమ్మ మూవీ కూడా ఆమె కెరీర్ కు మంచి టర్నింగ్ పాయింట్ గా నిలిచింది.
జమున సినీ రంగంలోనే కాకుండా రాజకీయలో కూడా తన కంటూ ఓ గుర్తింపు పేరుంది.1980లో రాజమండ్రి నుంచి కాంగ్రెస్ ఎంపీగా పోటీచేసి గెలిచారు.అయితే ఆమె కొన్ని రోజుల నుంచి ఆనారోగ్యం తో భాదపడుతూ శుక్రవారం జమున తుది శ్వాస విడిచారు. ఉదయం 11 గంటలకు ఫిలించాంబర్ కు జమున పార్థీవ దేహాన్ని తీసుకురానున్నారు.జమున అంత్యక్రియలను ఘనంగా నిర్వహించనున్నారు.తదనంతరం జమున అంత్యక్రియలను ఘనంగా నిర్వహించనున్నారు.