తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం ఆసన్నమౌతోంది.షెడ్యూల్ ప్రకారం నవంబర్ లేదా డిసెంబర్ లో ఎన్నికలు జరగాలి. కాకపోతే గత ఎన్నికల్లాగా ప్రభుత్వాన్ని కేసీఆర్ రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్తే మాత్రం మే లేదా జూన్ లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ముందస్తు ఎన్నికలకు కేసీఆర్ సిద్దపడినా , షెడ్యూల్ మేరకు ఎన్నికలకు వెళ్ళినా మరోసారి తెలంగాణ ముఖ్యమంత్రి కావడం కేసీఆర్ కు అతి పెద్ద సవాలే. ఎందుకంటే కేసీఆర్ పాలనపై రోజురోజుకు ప్రజా వ్యతిరేకత మరింత పెరుగుతుంది. ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని కేసీఆర్ ఏ కోశానా నెరవేర్చలేదు. రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేసిన కేసీఆర్ దేశ రాజకీయాల మీద దృష్టి పెట్టాడు. ప్రజా వ్యతిరేకతను బట్టి కేసీఆర్ మరోసారి అధికారంలోకి రావడం అతి కష్టమేనని తెలుస్తోంది. కాకపోతే ఎన్నికల ముందు ఓట్ల కోసం ప్రజలను మభ్యపెట్టడంలో దిట్టగా పేరున్న కేసీఆర్.. అధికారం కోసం మాయల ఫకీర్ వేషంలో మాయ మాటలతో ప్రజలను ఎలా మభ్యపెడుతాడనేది చూడాలి.
కేసీఆర్ కు ధీటుగా పోటా పోటిగా ప్రతిపక్షాలు దూకుడును ప్రదర్శిస్తున్నాయి. వచ్చే ఎన్నికలల్లో ఎలాగైనా కేసీఆర్ గద్దె దించే ప్రయత్నంలో తామంటే తామన్నామని కాంగ్రెస్,బీజేపీ పార్టీలు చెప్పుకుంటున్నాయి. ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో కేసీఆర్‌కు అవకాశం ఇవ్వకుండా ప్రణాళికలు రూపొందించుకుంటున్నాయి. కాంగ్రెస్ మాత్రం ఇన్నాళ్ళు అంతర్గత సమస్యలతో… ఐక్యమత్యం లేని సినియర్ నాయకులు.. ఇప్పుడు అందరు ఏకమై ఎన్నికల సమరానికి సిద్దమవుతున్నారు. ఈ పరిస్థితి కేసీఆర్ ఊహించింది కాదు. గత ఎన్నికల్లాగే విపక్షాలు బలపడేనాటికి ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నారు. గులాబీ బాస్ వ్యూహాన్ని పసిగట్టిన విపక్షాలు కేసీఆర్ కు మళ్ళీ ఆ అవకాశం ఇవ్వొద్దని భావిస్తున్నాయి.
రానున్న ఎన్నికలలో బీఆర్ఎస్ ను ఓడించే దిశగా విపక్షాలు ముందుగానే కసరత్తు చేస్తున్నాయి. కాంగ్రెస్ ఒంటరిగానే బరిలోకి దిగనుంది. అవసరమైతే బీఎస్పీ మద్దతు కూడగట్టుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీ మాత్రం జనసేన , టీడీపీ, వైఎస్సార్ టీపీతో కలిసి ఎన్నికలకు వెళ్ళే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక, బీఆర్ఎస్ కమ్యూనిస్టులతో కలిసి ఎన్నికలకు వెళ్ళడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్ళి ఓటర్లకు గాలం వేయాలని కాంగ్రెస్ గెలుపు వ్యూహాలను రచిస్తోంది. బీజేపీ కూడా అదే ధీమాతో ఉన్నా.. ఆ పార్టీకి మెజార్టీ నియోజకవర్గాల్లోబలమైన అభ్యర్థులే లేరు. రూరల్ నియోజకవర్గాల్లో క్యాడర్ కూడా లేకపోవడంతో బీజేపీ ఆశించిన సీట్లు దక్కించుకోవడం సందేహమే.