ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అదరగొట్టిన కొంతమంది యువ ఆటగాలకు చోటు ఇవ్వాలని బీసిసిఐ కసరత్తు చేస్తుంది. (ఐపీఎల్)లో చక్కటి ప్రతిభ చాటినా యువకులను ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ (డబ్ల్యూటీసీ) లో మరియు భారత జట్టు విండీస్ తో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లో చోటు కల్పిస్తే చక్కటి ప్రదర్శన చూపుతారని బీసిసిఐ వర్గాలు చర్చిస్తున్నాయి.
భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య రేపటి నుంచి ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ (డబ్ల్యూటీసీ) ప్రారంభం అవుతుంది.తదనంతరం భారత జట్టు విండీస్ పర్యటనకు వెళ్తుంది.భారత్ జట్టు విండిస్ తో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు తలపడనున్నాయి.
టీ20 సిరీస్ నుంచి కెప్టెన్ రోహిత్‌శర్మ, విరాట్‌కోహ్లీ, అశ్విన్, షమీకి విశ్రాంతి ఇవ్వాలని బిసిసిఐ భావిస్తున్నాయి. ఐపీఎల్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన రింకూసింగ్, యశస్వి జైస్వాల్, జితేశ్‌శర్మ వంటి యువ ఆటగాళ్లకు చోటివ్వాలని బీసీసీఐ వర్గాలు యోచిస్తున్నట్టు సమాచారం. అలాగే, పేసర్ మోహిత్‌శర్మ పేరును కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.ఈ టీ20 సిరీస్‌కు హార్ధిక్‌పాండ్యా నాయకత్వం వహించనుండగా సూర్యకుమార్‌యాదవ్‌కు వైస్ కెప్టెన్సీ అప్పగించే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి.మరి సెలెక్టర్లు బరిలో ఎవరిని దింపు తరాన్నది వేచి చూడాలి..