తెలంగాణాలో బీఆర్ఎస్ బహిష్కరించిన నేతలు జూపల్లి కృష్ణ రావు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏ పార్టీ లో చేరుతారన్నది ఇంకా క్లారిటీ లేదు.బీఆర్ఎస్ పార్టీ నుంచి దూరమైనా వీరిద్దరూ ఏ పార్టీ లో చేరుతరన్నది తెలంగాణ రాజకియలో హాట్ టాపిక్ మారింది.ఇటు కాంగ్రెస్,అటు బీజేపీ ఈ రెండు పార్టీ లు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జూపల్లి కృష్ణారావు చేర్చుకునే ఆలోచనలో వున్నాయన్న వాదనలు తెలంగాణ రాజకీయ పార్టీ లు వినిపిస్తున్నాయి.
బీఆర్ఎస్ పార్టీ కి దూరమైనా ఈ ఇద్దరు నేతలు ఏ పార్టీ లో చేరుతరన్నది క్లారిటి లేదు కాని,కర్ణాటక ఫలితాల తర్వాత కాంగ్రెస్ వైపే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారన్నది చర్చనియంశంగా మారింది.ఈ పితలాటకం కొనసాగుతున్న వేళ బీజేపీలో చేరరన్న విషయం మాత్రం తాజాగా కన్ఫమ్ అయ్యింది.ఈ ఇద్దరి నేతల దారెటు అనేది చూడాలి.
బీఆర్ఎస్ బహిష్కరించిన నేతలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జూపల్లి కృష్ణారావు బిజెపి చేరిక విషయమై ఆ పార్టీ నేత హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వారిద్దరూ బిజెపిలో చేరడం కష్టమేనని ఈటల రాజేందర్ ఓ క్లారిటీ ఇచ్చారు. ‘ఖమ్మంలో కాంగ్రెస్ బలంగా ఉంది. బిజెపి బలంగా లేదు. పొంగులేటి జూపల్లితో నేను రోజూ మాట్లాడుతున్నాను. వారే నాకు రివర్స్ కౌన్సిలింగ్ ఇస్తున్నారు’ అని ఈటల వ్యాఖ్యానించారు. వారు కాంగ్రెస్లోకి వెళుతూ తనను కూడా రావాలని సూచించినట్లు ఈటల వ్యాఖ్యల్లో స్పష్టమవుతోంది.
ఎమ్మెల్యే ఈటల రాజేందర్ రోజు తాను జూపల్లి కృష్ణ రావు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తో మాట్లాడుతూన్నాన్నని చెప్పారు.అయిన వాళ్ళు బీజేపీ పార్టీలో చేరే ఆలోచనలో లేరన్ని కాంగ్రెస్ వైపే ఎక్కువ మక్కువ చూపుతునరన్ని ఈటల చెప్పారు.బీఆర్ఎస్ కు దూరమైన ఈ ఇద్దరు నేతలు ఏ పార్టీలో చేరితో ఆ పార్టీ బలపడుతుందనేది రాజకీయ విశ్లేషకుల భావిస్తున్నారు.మరి ఏ పార్టీ లో చేరుతారన్నది వేచి చూడాలి.