బీఆర్ఎస్ నాయకుల వారసత్వ రాజకీయ విషయంలో రోజు రోజుకు కేసిఆర్ పై ఒత్తిడి జరుగుతుంది. ఎన్ని ఒత్తిడిలు వచ్చిన సరే వచ్చే ఎన్నికలో సీనియర్ నాయకులకే అవకాశాలు తప్ప వారసత్వాలకు నో ఛాన్స్ అంటూన్న కేసిఆర్.ఎట్టి పరిస్థితులో వారసత్వాలకు ఇవ్వకుండా సినియర్లకే చోటు ఇవ్వాలని కేసిఆర్ గట్టి నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తుంది.వారసత్వలకు టికేట్ కావాలని కోరుకుంటూ కే సీఆర్ పై ఒత్తిడి తెస్తున్న ఆ సీనియర్ నాయకులు ఎవరో చూద్దాం మరి.
స్పీకర్ గా ఉన్న నేత పోచారం శ్రీనివాస్ రెడ్డి పోటీ చేయాలని కేసీఆర్ ఆదేశించారు. నిజానికి పోచారం రిటైరైపోదామనుకుంటున్నారు. ఓపిక తగ్గిపోతోందని.. తన పిల్లలకు ఓ దారి చూపించాలని ఆయన కేసీఆర్ ను కోరుతున్నారు.పోచారం శ్రీనివాస్ రెడ్డి కుమారుడు కూడా ప్రజల్లో విస్తృతంగా తిరుగుతున్నారు. కానీ కేసీఆర్ మాత్రం ఈ సారి పోచారమే పోటీ చేయాలని తేల్చారు.
ఒక్క పోచారం మాత్రమే కాదు.. తమకు ఇవ్వకపోయినా పర్వాలేదు.. తమ పిల్లలకు టికెట్ ఇవ్వాలని కొందరు నాయకులూ కేసీఆర్ ను వేడుకున్నారు. కానీ కేసిఆర్ ఎవరికీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఆలోచనలో లేరు.అలాగే మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా తన కుమారుడికి కార్తీక్ రెడ్డి టికెట్ ఇవ్వాలని సబితా కేసిఆర్ ను పట్టుబడుతున్నారు.సబితా ఇంద్రారెడ్డిని పక్కన పెట్టి కార్తీక్ కు టిక్కెట్ ఇవ్వడానికి కేసీఆర్ సిద్ధంగా లేరు. ఇంకా ఇలా చెప్పుకుంటా పోతే,గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా తన కుమారుడి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.అలాగే కడియం శ్రీహరి కుమార్తెకు టిక్కెట్ ఇవ్వాలని అడుగుతున్నారు.
టీడీపీ ఆావిర్భావంతో తెలంగాణ నుంచి అనేక మంది నేతలు పైకి ఎదిగారు. వారిలో చాలా మంది ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్నారు. వారిలో ఓపిక ఉన్న వారు సరే.. ఓపిక లేని వాళ్లు మాత్రం వారసుల కోసం టికెట్ ఇవ్వాలని ఆశిస్తున్నారు. కానీ కేసీఆర్ మాత్రం ఒకరిద్దరికి చాన్స్ ఇచ్చినా ప్రజల్లో వారసత్వ భావన వస్తుందని.. అది డ్యామేజ్ చేస్తుందని కేసిఆర్ అనుకుంటున్నారు. అందుకే ఈ సారికి కూడా సీనియర్లకే టికెట్ ఇచ్చి పోటీ చేయాలని పట్టుబడుతున్నారు.