పన్నెండేళ్ల బాలిక తనకు తెలియకుండానే ఓ చిన్నారికి జన్మనిచ్చి తల్లిగా మారింది.ఈ ఘటన పంజాబ్‌లోని అమృత్సర్ జిల్లా ఫగ్వార్ లో జరిగింది.కొన్ని రోజుల నుండి కడుపు నొప్పితో బాధపడుతూ ఆ బాలికను తన తండ్రి గురునానక్‌దేవ్ ఆసుపత్రికి తీసుకెళ్లాడు.ఆసుపత్రికి వెళ్ళిన కూడా కడుపు నొప్పితో తరుచుగా బాధపడుతూ ఉన్నది.చివరికి ఆ బాలికకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమె గర్భవతి అని తేల్చారు.అనంతరం ప్రసవం చేసి 800 గ్రాముల బరువున్న పాపను బయటకు తీశారు. ఇద్దరి పరిస్థితి విషమంగానే ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు.
పన్నెండేళ్ల బాలిక తల్లి కావడం నేట్టిజన్లను అశ్యర్యపరిచింది.ఆ బాలిక తండ్రి మాట్లాడుతూ..ఏడు నెలలుగా తన కుమార్తె కడుపునొప్పితో బాధపడుతోందని, నొప్పి అన్నప్పుడల్లా మందులు తెచ్చి వేస్తున్నానని తెలిపాడు ఆ బాలిక తండ్రి చెప్పాడు.తన కుమార్తె తల్లి కావడం ఏందని వాపోయాడు.తన భార్య తనను విడిచి వెళ్లిపోయిందని,ఇంట్లో తామిద్దరమే ఉంటామని వివరించాడు.
తన తండ్రి ఆ బాలికను ప్రశ్నించగా ఏడు నెలల క్రితం బహిర్భూమికి వెళ్లిన సమయంలో అక్కడ గుర్తు తెలియని వ్యక్తులు తనపై అత్యాచారం జరిగిందని తెలిపింది. అప్పుడు అసలు విషయం తెలుసుకున్న పోలీస్ లు కేసు నమోదు చేసి నిందితుడిని త్వరలోనే అరెస్ట్ చేసి తగిన శిక్ష విధిస్తామని ఆ కుటుంబానికి పోలీసులు భరోసా ఇచ్చారు.