కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తెలంగాణలో ఒక కుటుంబం నుంచి ఒకరికే టికెట్ ఇవ్వాలి అని గతంలో నిర్ణయించుకున్నాడు.కాని తెలంగాణాలో రోజు రోజు కు కాంగ్రెస్ పార్టీ బలహినపడుతున్నా తరుణంలో తెలంగాణలో అధికార దిశ గా ఒక కుటుంబంలో నుంచి బలమైన నాయకులకు ఇద్దరికైన టిక్కెట్ ఇవ్వొచ్చు అనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.అయితే ఇప్పుడు అదే టాక్ ఎమ్మెల్యే సీతక్క కుటుంబంలో ఇద్దరికీ సీట్లు ఇవ్వడానికి రాహుల్ గాంధీ ఓకే చెప్పినట్టు సమాచారం.
ములుగు ఎమ్మెల్యే సీతక్క తెలంగాణ కాంగ్రెస్ ఒక ఫైర్ బ్రాండ్ నేత. ఆమె ప్రజల మనిషిగా జీవిస్తూ,ప్రజలకు ఎలాంటి ఆపదలు వచ్చిన వారి కష్టాలు తీర్చే నేతగా పేరు తెచ్చుకున్నారు ఎమేల్యే సీతక్క. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ఓట్లేసిన ప్రజలను ఆదుకోవడానికి ఎంతకైనా తెగించే నాయకురాలిగా ప్రఖ్యాతిగాంచారు. వరుసగా మూడు సార్లు ములుగు నియోజకవర్గం నుంచి గెలిచిన సీతక్క. ప్రజలకు తిరుగులేని ఎంపికగా మారారు.. ఇప్పుడు సీతక్క తన కొడుకుని రాజకియలోకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నరని సీతక్క అభిమానులు భావిస్తున్నారు.
సీతక్క కుమారుడు సూర్యకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.2018 లో పిన పాక నియోజకవర్గం నుంచి రేగా కాంత రావు కాంగ్రెస్ నుండి గెలిచి బీఆర్ఎస్ లో చేరాడు.అతనికి ధీటుగా బలమైన అభ్యర్థిని బరిలోకి దించాలి అంటే అక్కడి నుండి కేవలం సీతక్క కే సాద్యం కాబట్టి టీపీసీసీ రేవంత్ రెడ్డి సీతక్క కొడుకును అక్కడి నుండే పోటి చేపించే ఆలోచనలో ఉన్నారు అని పార్టీ వర్గాలు చెప్పుకోచ్చాయి.అందుకే సీతక్క తన కుమారుడు సూర్య ని పినపాక నియోజకవర్గానికి పంపి పనులను ప్రారభించినట్టు పబ్లిక్ టాక్.
సీతక్క కుమరుడు సూర్య యువకుడు కాబట్టి ప్రజలో చురుక్కు గా తల్లి తగ్గ తనయుడిగా పేరున్నా నాయకుడు. అదే విధంగా ప్రజలల్లో మంచి పేరున్నా నాయకురాలిగా,కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ గా పేరున్నా సీతక్క కుమారుడికి హై కమండ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు పార్టీ వర్గాలు చెప్పుకోచ్చాయి.
Also Read : ఎమ్మెల్యేగా సీతక్క కొడుకు పోటీ..?